తలైవా తగ్గేదేలే..!

Update: 2022-10-30 00:30 GMT
సూపర్‌ స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ 168 చిత్రాల్లో నటించిన తలైవార్.. తన కెరీర్ లో ఎత్తుపల్లాలను చవిచూశారు. ఎన్నో హిట్లు - సూపర్ హిట్లు - బ్లాక్ బస్టర్స్ సాధించారు.. అలానే పరాజయాలు కూడా అందుకున్నారు.

అయితే గత కొన్నేళ్లుగా రజినీ కెరీర్ అభిమానులు ఆశించిన విధంగా ముందుకు సాగడం లేదు. 2010 లో వచ్చిన 'రోబో' తర్వాత ఆ స్థాయిలో హిట్టైన సినిమా లేదని చెప్పాలి. 'కొచ్చాడయాన్' 'లింగా' 'కబాలి' 'కాలా' '2.0' 'పేట' 'దర్బార్' 'అన్నాత్తే' వంటి చిత్రాలలో ఒక్కటి కూడా తలైవా బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించలేకపోయాయి.

అయినప్పటికీ రజినీకాంత్ ఏమాత్రం తగ్గడం లేదు. 70 ఏళ్ళు దాటిన వయసులోనూ.. యంగ్ హీరోలతో పోటీగా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే.. బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

రజినీ ప్రస్తుతం నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తన 169వ చిత్రం ''జైలర్'' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. సన్‌ పిక్చర్ బ్యానర్ లో కళానిది మారన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మింస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన లభించింది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా సందడి చేయనుంది.

ఇదిలా ఉంటే ఇటీవలే లైకా ప్రొడక్షన్స్‌ వంటి అగ్ర నిర్మాణ సంస్థతో రజినీకాంత్ రెండు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. నవంబర్ 5న చెన్నైలో ఒకేసారి ఈ రెండు ప్రాజెక్ట్స్ ను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా రజినీ కాంత్ తో లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. అయితే తలైవా ని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్న దర్శకులు ఎవరనే దానిపై నిర్మాతలు క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే అందులో ఒక చిత్రానికి 'డాన్' ఫేమ్ శిబి చక్రవర్తి దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. త్వరలో రెండు సినిమాల దర్శకులను ప్రకటిస్తారు.

'జైలర్' మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే.. మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌ లను సెట్స్ మీదకు తీసుకురావడం వల్ల.. రజినీ పై అపారమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వయస్సు రీత్యా మానసింకంగా శారీరకంగా మరింత స్ట్రెస్ కు లోనవుతారేమోనని కలవర పడుతున్నారు.

'అన్నాత్తే' తో పాటుగా మరికొన్ని సినిమాల షూటింగ్ సమయంలో రజినీకాంత్ కు అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒకేసారి మూడు సినిమాలు చేస్తే.. సూపర్ స్టార్ ఇబ్బంది పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.

అయితే తలైవార్ మాత్రం తన ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదనిపిస్తోంది. తన అభిమానులను ప్రేక్షకులను అలరించడానికి ఏడు పదుల వయసులోనూ రెట్టింపు ఉత్సాహంతో పని చేయడానికి రెడీ అయ్యారని తెలుస్తోంది. మరి ఈ చిత్రాలు సూపర్ స్టార్ కు ఎలాంటి బీజయలు6అందిస్తాయో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News