రజినీకాంత్ అట్నుంచి నేరుగా అక్కడికి..

Update: 2018-03-18 09:47 GMT
ఏటా ఏదో ఒక సమయంలో హిమాలయాల పర్యటన చేస్తాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఐతే ఆ పర్యటన మామూలుగా చడీచప్పుడు లేకుండా సాగిపోతుంటుంది కానీ.. ఈసారి మాత్రం కొంచెం హడావుడి ఎక్కువైంది. తలైవా పర్యటన తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. డైలీ అప్ డేట్స్ బయటికి వస్తున్నాయి. ఈ పర్యటన ఇంకా ఎన్ని రోజులు సాగేది.. అనంతరం రజినీ ఏం చేయబోయేది.. ఎక్కడికి వెళ్లేది కూడా వెల్లడైంది. సూపర్ స్టార్ ఇంకో వారం రోజుల పాటు హిమాలయాల్లోనే ఉంటారట. ఆ తర్వాత ఆయన చెన్నైకి రావట్లేదట. నేరుగా దిల్లీ చేరుకుని అక్కడి నుంచి అమెరికా వెళ్లబోతున్నారట రజినీ.

రెండేళ్ల కిందట అనారోగ్యం పాలైన రజినీ రెండు నెలల పాటు అమెరికాలో ఉండి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కూడా ఆయన అమెరికాకు చెకప్ కోసం వెళ్లారు. ఇప్పుడు కూడా రజినీ అమెరికాకు వెళ్లి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు రజినీ. దాని కంటే ముందు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయాల్సి ఉంది. ఇవన్నీ శ్రమతో కూడుకున్న వ్యవహారాలే. అందుకే హెల్త్ చెకప్ చేయించుకుని పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని.. తర్వాత ఏ సమస్యలూ రాకుండా జాగ్రత్త పాటించాలని రజినీ భావిస్తున్నాడు. అందుకే ఈ అమెరికా పర్యటన అని సమాచారం. నెల రోజులు అమెరికాలోనే ఉండి తర్వాత ఆయన ఇండియాకు తిరిగొస్తారట.

Tags:    

Similar News