రజనీ డేటిచ్చేశాడు.. మరి మనోళ్ళు??

Update: 2018-02-10 16:44 GMT
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన 2.0 కోసం ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. కానీ సినిమా రిలీజ్ డేట్ జనాలను బాగా ఊరిస్తోంది. గత కొంత కాలంగా సినిమా వాయిదాల డేట్ లతోనే కొనసాగుతోంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఆ సినిమాకంటే ముందే రజినీకాంత్ కాలా వచ్చేస్తోంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 27న నిర్మాత ధనుష్ రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మన స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్ లు కన్ఫ్యూజన్ లో పడ్డాయి.

2.0 సినిమా వస్తుందనే గత కొంత కాలంగా మహేష్ - భరత్ అనే నేను అలాగే అల్లు అర్జున్ - నా పేరు సూర్య సినిమాలు రిలీజ్ డేట్ లు అనుమానాలను కలిగించాయి. చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలియదు. అయితే 2.0 ఆలస్యం అవ్వడంతో మొదట ఊపిరి పీల్చుకున్న ఈ సినిమాల నిర్మాతలకు రజినీ వెరైటీగా షాక్ ఇచ్చాడు. కాలా సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అయినా అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయాలనీ రజినీ ఫిక్స్ అయ్యాడు. దీంతో అల్లు అర్జున్ - మహేష్ ఇప్పుడు ఏం చేస్తారు అనేది హాట్ టాపిక్ గా మౌరింది. వస్తే ముందైనా రావాలి. లేదంటే తరువాత అయినా రావాలి.

ముఖ్యంగా 20 రోజుల ముందే డేట్ ను ఫిక్స్ చేస్తే అందరికి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే సినిమా బిజినెస్ బాగుండాలంటే అలా చెప్పడం చాలా అవసరం.అయితే ఏప్రిల్ సెకండ్ వీక్ లోనే వస్తున్నట్లు బన్నీ నిర్మాత ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. కానీ మహేష్ నిర్మాత మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరి కాలా కారణంగా వారి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News