రజినీ కోసం చెన్నైలో ముంబయి

Update: 2017-05-29 06:34 GMT
సౌత్ ఇండియాలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరో ఎవరు అంటే.. మరో మాట లేకుండా సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు చెప్పేయొచ్చు. ఆయన మీద భారీ బడ్జెట్లు పెట్టే సౌలభ్యం నిర్మాతకు ఉంటుంది. నిర్మాణం విషయంలో ప్రొడ్యూసర్లు రాజీ పడాల్సిన అవసరమే ఉండదు. శంకర్ దర్శకత్వంలో రజినీ నటిస్తున్న ‘2.0’ మీద దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌ పెడుతున్న సంగతి తెలిసిందే. ‘2.0’ తర్వాత రజినీ నటిస్తున్న ‘కాలా’ సినిమా కోసం కూడా బాగానే ఖర్చు పెడుతున్నాడు నిర్మాత ధనుష్. ఈ చిత్రం కోసం చెన్నైలో భారీ సెట్టింగ్ వేయిస్తున్నాడు ధనుష్. ‘కాలా’ షూటింగ్ ముంబయిలో శనివారమే ఆరంభం కాగా.. మరోవైపు చెన్నైలో సెట్టింగ్ పనులు జరుగుతున్నాయి.

ముంబయిలో ప్రసిద్ధి చెందిన ధారవి మురికివాడ సెట్టింగ్ ను చెన్నైలో వేస్తున్నారట ‘కాలా’ కోసం. అసియాలోనే అతి పెద్ద మురికివాడగా పేరొందిన ధారవి స్లమ్ లో షూటింగ్ చేయడం చాలా కష్టం. అందుకే దాన్ని పోలిన సెట్టింగ్ చెన్నైలో వేసేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.5 కోట్లు ఖర్చవుతోందట. ఏవో ఒకటి రెండు బిల్డింగ్ సెట్స్ అయితే ఓకే కానీ.. ఏకంగా ఒక మురికివాడను తలపించే సెట్టింగ్స్ వేయడమంటే మాటలు కాదు. ఖర్చుతో పాటు శ్రమ కూడా ఎక్కువే ఉంటుంది. ముంబయి నేపథ్యంలో సాగే ‘కాలా’లో రజినీ మాఫియా డాన్ పాత్ర పోషిస్తున్నాడు. ముందు ముంబయిలోని కొన్ని రియలిస్టిక్ లొకేషన్లలో షూటింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు దర్శకుడు రంజిత్. అక్కడ షెడ్యూల్ అయ్యాక చెన్నైలో వేసిన సెట్టింగ్ లో షూటింగ్ చేయబోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News