హాస్పిటల్ లో రజినీకాంత్

Update: 2016-01-11 17:30 GMT
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. చాలా ఏళ్ల తర్వాత ఒకేసారి రెండు సినిమాలు షూటింగ్ చేస్తున్నారాయన. పా రంజిత్ తీస్తున్న కబాలి షూటింగ్ ఒకటి అయితే.. దిగ్గజ దర్శకుడు శంకర్ తీస్తున్న రోబో సీక్వెల్ మరొకటి. కనీసం చిన్న గ్యాప్ కూడా లేకుండా ఈ రేంజ్ లో కంటిన్యూగా షూటింగ్ చేస్తుండడం ఆశ్చర్యపరిచింది.

తాజాగా రజినీకాంత్ ను ఓ హాస్పిటల్ బయట చూసినవాళ్లకు చాలా ఆశ్చర్యం వేసింది. తమ తలైవాకి ఏమైందంటూ ఆరా తీయటం మొదలుపెట్టారు. కేలంబాక్కం లోని చెట్టినాడు హాస్పిటల్ కు వెళ్లారు రజినీకాంత్. అయితే.. ఇలా ఆయన ఆస్పత్రికి వెళ్లింది తనకు ట్రీట్ మెంట్ చేయించుకోవడానికి కాదు. అది కేవలం షూటింగ్ లో భాగమే. ప్రస్తుతం  కబాలి యూనిట్ కీలకమైన పలు హాస్పిటల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ తో దాదాపుగా కబాలికి సంబంధించిన టాకీ పార్ట్ కంప్లీట్ పూర్తి కానుంది.

ఆ వెంటనే రజినీకాంత్ రోబో 2.0 షూటింగ్ లో కూడా భాగం కానున్నారు. ఇందులో కూడా రజినీకి సంబంధించిన వెర్షన్ ను త్వరగా పూర్తి చేసేందుకు డైరెక్టర్ శంకర్ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 3 నుంచి 4 నెలల్లోనే మధ్యలో కొన్ని బ్రేక్ లు ఉండేలా చూసి మరీ.. రజినీకాంత్ పై ప్రధాన సన్నివేశాలన్నీ చిత్రీకరించేలా ప్లాన్ చేశారుట. చివర్లో మళ్లీ అవసరమైతే కొన్ని ప్యాచప్ వర్క్స్ చేయాలని నిర్ణయించారట. హెల్త్ విషయంలో తలైవా ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా సరే ఇంత యాక్టివ్ గా షూటింగ్ లో భాగం కావడం మాత్రం విశేషమే.
Tags:    

Similar News