సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకున్న విషయం తెల్సిందే. దేశంలో సినిమా పరిశ్రమ వారికి ఇచ్చే ఆ అత్యున్నత పురష్కారం రజినీకాంత్ కు దక్కడం ఆయన అభిమానులకు పండుగ తెచ్చి పెట్టింది. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్న సమయంలో రజినీకాంత్ మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తన గురువు మరియు తనలో నటుడు ఉన్నట్లుగా గుర్తించిన బస్సు డ్రైవర్ స్నేహితుడికి అవార్డును అంకితం ఇస్తున్నట్లుగా రజినీకాంత్ ప్రకటించాడు. పాల్కే అవార్డును దక్కించుకున్న తర్వాత కూడా రజినీకాంత్ ఢిల్లీలోనే ఉన్నారు. అక్కడ ప్రెసిడెంట్ కోవింద్ మరియు ప్రధాని నరేంద్ర మోడీని రజినీకాంత్ దంపతులు కలవడం జరిగింది.
పీఎం నరేంద్ర మోడీతో పాటు రామ్ నాథ్ కోవింద్ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని.. ఇద్దరితో కలిసిన సమయంలో వారి నుండి శుభాకాంక్షలు పొందినట్లుగా రజినీకాంత్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఇద్దరిని కలిసిన సమయంలో రజినీకాంత్ వెంట ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఇద్దరు కూడా రజినీకాంత్ ను చాలా ఆప్యాయంగా పలకరించారని.. అవార్డు వచ్చిన సందర్బంగా అభినందించారంటూ సమాచారం అందుతోంది. రజినీకాంత్ సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా చాలా ఫేమస్. సుదీర్ఘ కాలంగా సినిమాలకు సేవ చేస్తున్నందుకు గాను రజినీకాంత్ కు ఈ అవార్డు దక్కిందనే విషయం తెల్సిందే.
ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్తే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కీర్తి సురేష్ మరియు నయనతారలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో ఖుష్బు మరియు మీనా లు నటించారు. ఈ సినిమా పై రజినీకాంత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా రజినీకాంత్ అభిమానులతో పాటు ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకను ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ను తెలుగు లో పెద్దన్న అనే టైటిల్ తో డబ్ చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా రజినీకాంత్ నుండి ఆశించిన స్థాయిలో భారీ విజయాలు దక్కడం లేదు. దాంతో ఈ సినిమా పై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.