సంక్రాంతి సినిమాల సందడి నేటితో మొదలైంది. ముందుగా సూపర్ స్టార్ రజిని రంగంలో దిగాడు. గతేడాది 'పేట' సినిమాతో సంక్రాంతికి వచ్చిన సూపర్ స్టార్ రజిని ప్రేక్షకులను పూర్తి స్తాయిలో మెప్పించలేకపోయాడు. 'కబాలి'- 'కాలా' డిజాస్టర్స్ గా నిలవడంతో పేట వాటి మీద పరవాలేదు అనే టాక్ అందుకొని కమర్షియల్ గా పరవాలేదనిపించుకుంది. ఆ సినిమాలో రజిని స్టైల్ - యాక్షన్ ఎపిసోడ్స్ ను బాగా ఎంజాయ్ చేసారు ఆడియన్స్.
అయితే ఈ రోజు రిలీజైన 'దర్బార్' లో కూడా మళ్ళీ అదే రిపీట్ అయింది. అవును సినిమాను తన భుజాలపై పెట్టుకొని మోసుకొచ్చాడు రజిని. తన స్టైల్స్ కి ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేసి అదుర్స్ అనిపించాడు. డెబ్బై ఏళ్ల వయసులోనూ ఎప్పటిలాగే మేజిక్ చేసాడు. ఇక మురుగదాస్ కూడా కథను కాకుండా పూర్తిగా రజిని మేనియాను నమ్ముకునే ఈ సినిమా తీశాడు.
ముఖ్యంగా రెండో భాగంలో సినిమా భారం అంతా రజిని మీదే వేసేసి తన రైటింగ్ స్టైల్ ను వదిలేసాడు. కొన్ని సందర్భాల్లో మురుగదాస్ - కార్తీక్ సుబ్బరాజు ను ఫాలో అయిపోయి సినిమా తీసినట్టు అనిపిస్తుంది కూడా. అది ప్రేక్షకులను బాగా నిరాశ పరిచింది. ఇక కంటెంట్ కోసం కాకుండా రజిని కోసం ఈ సినిమా చూస్తే మాత్రం ఫ్యాన్స్ ఫిదా అవుతారు. కానీ ఈ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.