మొత్తానికి రజనీని ఒప్పించావుగా..

Update: 2018-06-15 03:59 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ ఉన్నట్టుండి స్టయిల్ మార్చాడు.  ఒక సినిమా పూర్తి కాకుండానే రెండో సినిమాకు ఓకే చెప్పేస్తున్నాడు. ఇంతకుముందు రెండేళ్లకో సినిమా చేస్తుండేవాడు. ఒక సినిమా రిలీజైన చాలా రోజుల తరవాత గానీ ఇంకోదానికి ఓకే చెప్పేవాడు కాదు. కానీ ఇప్పుడు వరసగా సినిమాలు చేయడానికి డైరెక్టర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.

రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ 2.0 సినిమా షూటింగ్ ఎన్నో నెలల కిందట మొదలెట్టారు. గ్రాఫిక్ వర్క్ కొలిక్కిరాక ఈ మూవీ రిలీజ్ వెనక్కిపోతూనే ఉంది. దానికన్నా వెనుక స్టార్ట్ చేసిన కాలా షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లకు వచ్చేసింది. కాలా రిలీజ్ కాకముందే పిజ్జా ఫేం డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్టయింది. దీని తరవాత ఎ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రజనీ ఓకే చెప్పడం కోలీవుడ్ ను ఆశ్చర్య పరుస్తోంది.

ఇంతకుముందు రజనీతో సినిమా తీయడానికి మురుగదాస్ ఓ స్టోరీ తయారు చేసుకున్నాడు. కాకుంటే రజనీ ఆ స్టోరీ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. దాంతో మురుగదాస్ రజనీకి నచ్చేలా స్క్రిప్టులో మార్పుచేర్పులు చేసి వినిపించాడట. మురుగుదాస్ చెప్పిన మార్పులు నచ్చడంతో రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసింది. ప్రస్తుతం మురుగదాస్ తమిళ్ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే రజనీ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. రాజకీయాల్లోకి  అడుగు పెట్టబోతున్నానంటూ చెబుతున్న రజనీ వరసగా సినిమాలు ఓకే చేయడం అనేదే కోలీవుడ్ జనాలకు అంతుపట్టడం లేదు.
Tags:    

Similar News