ఇప్పటిదాకా కమర్షియల్ మాస్ సినిమాలకు కట్టుబడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మధ్య రూటు మార్చి సీత నుంచి విభిన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో కొత్త సినిమా రాక్షసుడు విడుదలకు రెడీ అవుతుంది. ఇందాకా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో చూచాయగా కథను చెప్పే ప్రయత్నం చేశారు. సిటీలో అంతు చిక్కని రీతిలో టీనేజ్ అమ్మాయిల హత్యలు జరుగుతూ ఉంటాయి. ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు.
దీని విచారణలో ఉంటాడు పోలీస్ ఆఫీసర్ అయిన హీరో(సాయి శ్రీనివాస్). తన టీమ్ తో కలిసి కొన్ని క్లూస్ సాధిస్తాడు. దాన్ని బట్టి ఈ హత్యలు చేస్తున్న వ్యక్తికి యాంటీ సోషల్ డిజార్దర్ ఉందని డాక్టర్(సూర్య)ద్వారా తెలుసుకుంటాడు. హీరోకు సహాయంగా టీచర్(అనుపమ పరమేశ్వరన్)ఉంటుంది. పిల్లలు ఆడుకునే చిన్న బొమ్మ తప్ప ఇంకే ఆధారం లేని పరిస్థితుల్లో సైకోని హీరో ఎలా పట్టుకుని రాక్షసుడి అరాచకాలకు చెక్ పెడతాడు అనేదే కథ
తమిళ్ బ్లాక్ బస్టర్ రట్ససన్ రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో టీజర్ ని బట్టి చూస్తే అదే డెప్త్ అదే ఇంటెన్సిటీ ని క్యారీ చేసినట్టు కనిపిస్తోంది. పాత్రలను ఎంచుకున్న తీరు రెగ్యులర్ అంశాలకు దూరంగా కథకే కట్టుబడి కథనాన్ని పరిగెత్తించిన తీరు విజువల్స్ లో గమనించవచ్చు. జీబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో హై లైట్ గా నిలవబోతోంది. హీరో హీరోయిన్లు కాకుండా సూర్యతో పాటు రాజీవ్ కనకాల పాత్రలు మాత్రమే ఇందులో రివీల్ చేశారు.
వెంకట్ సి దిలీప్ ఛాయాగ్రహణం థీమ్ కు తగ్గట్టు పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. మొత్తానికి చాలా కాలం తర్వాత తెలుగులో ఓ మంచి సైకో థ్రిల్లర్ చూడబోతున్నామన్న హామీ రాక్షసుడు టీమ్ ఇచ్చినట్టు అయ్యింది. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీకి అభిషేక్ పిక్చర్స్ మరియు కోనేరు సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూలై 17న రాక్షసుడు విడుదల కానుంది
Full View