పెద్ద నిర్మాతలు అంతే.. టాలెంట్ ఉన్న చోట కర్చీఫ్ వేసేస్తారు. ఈ విషయంలో మిగతా వారికంటే అల్లు అరవింద్ రెండాకులు ఎక్కువే చదివాడు. టాలెంట్ ను పసిగట్టి అవకాశాలివ్వడంలో.. కథల్ని - సినిమాల్ని జడ్జ్ చేయడంలో ఆయనది అందె వేసిన చేయి. మారుతి విషయంలో మిగతా వాళ్లంతా సందేహాలు వ్యక్తం చేస్తున్న టైంలో అతడి టాలెంట్ గుర్తించి వరుసగా అవకాశాలిచ్చాడు. ‘భలే భలే మగాడివోయ్’సినిమాతో భారీగా లాభాలు అందుకున్నాడు. ఇప్పుడు మరో కుర్ర డైరెక్టర్ మీద అల్లు కళ్లు పడ్డట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. రాకేశ్ శశి.
‘జత కలిసే’ సినిమాతో రాకేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమాలో పెద్దగా పేరున్న నటీనటులు లేకున్నా,.. నిర్మాత - దర్శకుడు కొత్త వాళ్లే అయినా.. సాయి కొర్రపాటి లాంటి పెద్ద నిర్మాత ‘జత కలిసే’ను హోల్ సేల్ గా కొనేసి క్రిస్ మస్ కు విపరీతమైన పోటీ ఉన్నా కాన్పిడెంట్ గా రిలీజ్ చేస్తున్నాడంటే రాకేశ్ ఎంతగా ఇంప్రెస్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. రాఘవేంద్రరావు నిర్వహించిన టీవీ షో ‘రేపటి దర్శకులు’లో టాలెంట్ చాటుకుని ‘జత కలిసే’ అవకాశం పట్టేశాడు రాకేశ్. ఈ సినిమాను సాయి కొర్రపాటి చూడకముందే అల్లు అరవింద్ చూసి.. రాకేశ్ టాటెంటుకి ఫిదా అయిపోయి, తన చిన్న కొడుకు శిరీష్ హీరోగా తమ బేనర్ లో సినిమా చేయడానికి కమిట్ మెంట్ తీసుకున్నాడట. ఆ సంగతి తెలిసే సాయి కొర్రపాటి కూడా ‘జత కలిసే’ చూసి దాన్ని హోల్ సేల్ గా కొనేసినట్లు సమాచారం.