ఇండియన్ సినీ ప్రేక్షకులకు రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా పాపులారిటీని దక్కించుకుంది. ఈమె సోషల్ మీడియాల్లో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈమె కొన్ని నెలల క్రితం ప్రియుడు దీపక్ ఖలాల్ ను వివాహం చేసుకోబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలేసుకుని తిరగడంతో పాటు టీవీ షోలు కూడా చేశారు. ఏమైందో ఏమో కాని కొన్నాళ్ల క్రితం దీపక్ ఖలాల్ నుండి బ్రేకప్ అయినట్లుగా ప్రకటించింది.
ఇక ఇటీవలే రహస్యంగా రాఖీ ఒక ఎన్నారై బిజినెస్ మన్ ను వివాహం చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ల తర్వాత ఈమె తమ పెళ్లి విషయాన్ని బయట పెట్టింది. హనీమూన్ కూడా పూర్తి చేసుకున్న రాఖీ సావంత్ సోషల్ మీడియాలో పెళ్లి విషయం చెప్పగానే ఆమె మాజీ ప్రియుడు దీపక్ ఖలాల్ షాక్ అయ్యాడట. రాఖీ సావంత్ పెళ్లి చేసుకున్న విషయమై అతడు తీవ్రంగా స్పందించాడు. ఒక వీడియోను విడుదల చేసి రాఖీ సావంత్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
దీపక్ ఖలాల్ విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ రాఖీ తనకు రూ.4 కోట్లు ఇవ్వాలన్నాడు. నాలుగు రోజుల్లో ఆ మొత్తం ఇవ్వకుంటే రాఖీ జీవితంను నాశనం చేస్తానంటూ హెచ్చరించాడు. అందుకు గాను దీపక్ ఖలాల్ తన వద్ద ఉన్న కొన్ని రాఖీ సావంత్ ప్రైవేట్ వీడియోలను లీక్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీపక్ ఖలాల్ హెచ్చరికను రాఖీ సావంత్ చాలా లైట్ గా తీసుకున్నట్లుగా అనిపించింది. తన భర్త గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదంది. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఏం చేయలేవంటూ దీపక్ ఖలాల్ ను ఉద్దేశించి సవాల్ చేసింది.