నిన్నటి నుంచి దేశీయ మీడియా అంతా ఓ విషయంలో హంగామా జరిగిపోతోంది. ఎప్పటికప్పుడ సంచలనాల్లో నిలిచే సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారనే టాక్ విపరీతంగా వినిపించింది. వాల్మీకి మునిపై రాఖీ చేసిన వ్యాఖ్యల కారణంగా.. ఆమెపై కోర్టు అరెస్ట్ వారంట్ ఇష్యూ చేసిన సంగతి తెలిసిందే.
ఆ వారంట్ ఆధారంగా రాఖీ సావంత్ ను అరెస్ట్ చేశారన్నది వార్తల సారాంశం. అయితే.. ఈ న్యూస్ ను లూధియానా పోలీసులు ఖండించారు. 'రాఖీ సావంత్ ను మేం అరెస్ట్ చేయలేదు. కోర్టు అరెస్ట్ వారంట్ ఇష్యూ చేసిన మాట వాస్తవమే అయినా.. లూధియానా నుంచి ముంబై వెళ్లిన పోలీసులకు.. ఇచ్చిన అడ్రస్ లో ఆమె కనిపించలేదు. అందుకే ఆమెను అరెస్ట్ చేయలేదు' అని లూధియానా పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని కోర్టుకు వెల్లడిస్తామని వివరించారు.
ఓ ప్రైవేటు టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ కమ్యూనిటీపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిందంటూ వాల్మీకి వంశస్తులు ఫిర్యాదు చేశారు. మార్చ్ 9న ఈమెపై అరెస్ట్ వారంట్ ఇష్యూ కాగా.. ఈ కేసుపై ఏప్రిల్ 10న మరుసటి విచారణ జరగనుంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/