టాలీవుడ్ లో నెక్ట్స్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అనే మాట చాలా స్ట్రాంగ్ గానే వినిపిస్తుంది. ఆమెకు వరుసగా అందుతున్న అవకాశాలు.. చేస్తున్న భారీ చిత్రాలు.. వాటిలో పలు సక్సెస్ లు ఇందుకు కారణం అవుతున్నాయి. అయితే.. క్యారెక్టర్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా ఉంటుందనే సంగతి ఇప్పుడు రకుల్ కి బాగానే అర్ధమవుతోంది.
నాన్నకు ప్రేమతో.. సరైనోడు.. ధృవ.. ఇక్కడి వరకూ రకుల్ జర్నీ బాగానే సాగింది. ఆ తర్వాత విన్నర్ తో ఎదురుదెబ్బ తగిలినా.. రారండోయ్ వేడుక చూద్దాంతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. జయ జానకి నాయక రిజల్ట్ అంత గొప్పగా ఏం లేదు. ఇప్పుడు స్పైడర్ మూవీతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాతో ఆడియన్స్ ను పలకరించింది రకుల్. వీటిలో రకుల్ పెర్ఫామెన్స్ ను బేస్ చేసుకుని ఆడిన సినిమా చెప్పమంటే.. టక్కుమని చెప్పడం చాలా కష్టమైన విషయం. ఏ మూవీలో గ్లామర్ గా కనిపించిందంటే మాత్రం.. ఒకట్రెండు మినహాయిస్తే అన్నీ చెప్పేయచ్చు. కమిట్మెంట్ చూపడంలో రకుల్ ప్రీత్ ను తక్కువ చేయలేం కానీ.. ఫుల్ ప్లెడ్జెడ్ గా పెర్ఫామెన్స్ విషయంలో రకుల్ కొంత ఫెయిల్ అవుతోంది.
రీసెంట్ గా స్పైడర్ మూవీలో అయితే.. పెళ్లికి ముందే సెక్స్ అనుభవం తెలుసుకోవాలనే మెడికో (మెడికల్ ప్రొఫెషన్ నే డైరెక్టర్ ఎందుకు ఎంచుకున్నాడో కదా) రోల్ లో కనిపిస్తుంది. మహేష్ బాబు సినిమానే కాదు.. ఇలాంటి క్యారెక్టర్ తో ఎంత పెద్ద హీరో పక్కన నటించినా.. ఒరిగేదేమీ ఉండదనే విషయం అర్ధం కావడానికి రకుల్ కి బాగానే ఆలస్యమైనట్లుగా ఉంది. మరి తదుపరి సినిమాల నుండి గ్లామర్ గేట్లను తెరిచేసి భారీగా దోచుకుంటుందా? లేదంటే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుందా? చూద్దాం.