టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి కమిట్మెంట్ బాగా ఎక్కువ అని ఇండస్ట్రీలో బోలెడంత టాక్. షూటింగ్ స్పాట్ కి రావడంలో స్ట్రిక్ట్ టైమింగ్స్ పాటించడం.. ఎలాంటి సిట్యుయేషన్స్ కి అయినా అడ్జస్ట్ అయ్యే సింప్లిసిటీ అన్నిటికీ మించి అవీ ఇవీ కావాలంటూ డిమాండ్స్ చేయకపోవడంతో ఈమెకు ఛాన్స్ ఇచ్చేందుకు దర్శకులు ఇంట్రెస్ట్ చూపుతారు.
వీటన్నిటితో పాటు రకుల్ కి ఫిట్నెస్ అంటే మహా పిచ్చి. అంతే కాదు భక్తి భావం కూడా బాగా ఎక్కువ. తరచుగా గుళ్లు గోపురాలు అని తిరిగేస్తుంటుంది. తాజాగా కూడా తిరుమల వెళ్లింది రకుల్ ప్రీత్. తనేమీ సింగిల్ గా వెంకటేశ్వరుని దగ్గరకు వెళ్లలేదు. మంచు లక్ష్మి.. ఆమె భర్త తిరుమల వెళుతుంటే.. వారితో కలిసి శ్రీనివాసుని దర్శనానికి వెళ్లిపోయింది. పైగా ఏడుకొండవాడి దగ్గరకు.. వీళ్లంతా మెట్లెక్కి వెళ్లడం విశేషం. మంచు లక్ష్మి.. ఆమె భర్త.. రకుల్ ప్రీత్ ముగ్గురూ కలిసి ఏడు కొండలను ఎక్కేసి మరీ తిరుమల చేరుకున్నారు. ఇదుగో ఈ ఫోటో ఆ మెట్లెక్కుతున్నప్పుడు క్లిక్ మనిపించినదే.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మహేష్ కి జోడీగా రకుల్ నటించిన స్పై-డర్ ఫస్ట్ లుక్ ఇవాళ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ కానుంది. రా రండోయ్ వేడుక చూద్దాం చిత్రంలో నాగచైతన్యతో నటిస్తుండగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందే చిత్రంలో లీడ్ హీరోయిన్ గా చేస్తోంది రకుల్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/