సినిమాలో ఎక్కడో ఒకచోట ప్రేక్షకుడితో అర్రే... అనిపిస్తూ వాళ్లని సర్‌ప్రైజ్‌కి గురిచేయాలనేది దర్శకుల ఆలోచన. ఆ మేరకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొద్దిమంది ఇంట్రవెల్ బ్యాంగ్‌లో ఆసక్తికరమైన ఎలిమెంట్‌ని పెడుతుంటారు. మరికొంతమంది క్లైమాక్స్‌లో ఇంకో రకమైన ట్విస్ట్ ఇచ్చి ప్రేక్షకుడిని బయటికి పంపుతుంటారు. కొన్నిసార్లు కథతో సంబంధం లేని, అప్పటిదాకా కనిపించని కొత్త మొహాల్ని కూడా చూపెడుతుంటారు. అది కూడా ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది. ఆమధ్య 'మోసగాళ్లకు మోసగాడు'లో మంచు మనోజ్ సడన్‌గా ఎంట్రీ ఇచ్చేశాడు. అలాంటి అతిథి పాత్రలు సినిమాకి భలే కిక్కిస్తుంటాయి. రకుల్ కూడా 'టైగర్'లో అలా సడన్‌గా ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె తెరపై మెరవడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.
'టైగర్' సినిమాలో సందీప్‌కిషన్ హీరోనే అయినా... ఆయనకి అస్సలు హీరోయినే ఉండదు. ఆయన హీరోయిన్ చివర్లో కేవలం రెండు మూడు సెకన్లు కనిపిస్తుందంతే. హాయ్... అని అలా చేయి వూపి ఇలా వెళ్లిపోతుంది. అది ఎవరో కాదు... రకుల్‌ప్రీత్‌సింగ్. రకుల్‌కీ, సందీప్‌కిషన్‌కీ మధ్య మంచి స్నేహం ఉంది. రకుల్‌కి తొలి హిట్టిచ్చిన హీరో సందీపే. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'లో ఇద్దరూ కలిసి నటించారు. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది. ఆ అనుబంధంతోనే రకుల్ ప్రీత్‌సింగ్ అతిథి పాత్ర చేయడానికి ఒప్పుకొన్నట్టుంది. 'టైగర్' క్లైమాక్స్‌లో అందంగా అలా కనిపించి ఇలా మాయమైపోతుంది.