పిక్ టాక్ : రకుల్‌ స్టైలిష్‌ కవర్ ఫోజ్‌

Update: 2021-07-16 06:30 GMT
టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్ మోడలింగ్‌ లో మొదటి నుండే మంచి గుర్తింపు దక్కించుకుంది. స్టైల్‌ ఐకాన్‌ గా ఈ అమ్మడు మంచి పేరును దక్కించుకోవడంతో పాటు హీరోయిన్ గా టాప్ స్టార్స్ తో నటించింది. తెలుగు లోనే కాకుండా ప్రస్తుతం ఇతర భాషల్లో కూడా బిజీగా ఉన్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక వైపు నటిగా బిజీగా ఉన్న రకుల్‌ ప్రీత్‌ మరో వైపు ఇలా కవర్‌ ఫొటోలకు ఫొటో షూట్ ఇస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ మ్యాగజైన్‌ కోసం ఇలా స్టైలిష్‌ కాస్ట్యూమ్స్ తో స్టైలిష్‌ ఫోజ్ ఇచ్చింది.

రకుల్‌ నెట్‌ తరహా టాప్ ను ధరించి బ్లాక్‌ లో మెరిసి పోతుంది. బ్లూ జీన్స్ తో పాటు స్టైలిష్‌ మేకోవర్‌ తో వావ్‌ అనేట్లుగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఈ ఫొటో నెట్టింట ట్రెండ్‌ అవోతుంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్ ప్రతి సారి కూడా ఇలా కవర్‌ ఫొటో పోస్ట్‌ తో మెరిసి పోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఇలాంటి కవర్‌ ఫొటో షూట్‌ లతో గతంలో పలు సార్లు నెట్టింట హల్ చల్‌ చేసింది. ఈ సారిగా ఫుల్‌ గా కవర్ చేసే డ్రస్ లో కనిపించినా కూడా నెటిజన్స్ వావ్ అంటున్నారు.

బికినీ నుండి చీరలో హాట్‌ గా కనిపించే వరకు అన్ని రకాలుగా ముద్దుగుమ్మ ఆకట్టుకుంది. ప్రతి కాస్ట్యూమ్ కూడా ఈమెకు అద్దినట్లుగా ఉంటుందని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. తన ప్రతి లుక్‌ లో కూడా భలే ఉందే అనే టాక్ ను అభిమానుల నుండి సొంతం చేసుకుంటూ వస్తోంది. తెలుగు లో ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయట. త్వరలో క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమాతో ఈమె రాబోతుంది. ఇక హిందీ మరియు తమిళంలో కూడా ఈమె నటిస్తూ ఉంది. సినిమాల్లోనే కాకుండా కమర్షియల్‌ తో కూడా బిజీ బిజీగా ఉంది.
Tags:    

Similar News