నీచమైన కామెంట్లు చేస్తే సహించను: రకుల్ ప్రీత్ సింగ్

Update: 2020-03-17 15:30 GMT
రకుల్ ప్రీత్ సింగ్. గతేడాది నుండి సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ అవుతున్న పేరు. అటు హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో ఒడిదుడుకులను, ఇటు సోషల్ మీడియాలో చేదు అనుభవాలను ఎదుర్కొంటుంది. రకుల్ నటించిన సినిమాల తో ఎంతమంచి పేరు సంపాదించుకుందో.. సినిమాల మధ్య ఫోటోషూట్ల తో అంతే ట్రోలింగ్ కి గురవుతుంది. ఈ మధ్య జనాలు ఘోరంగా తయారయ్యారంటూ తనకు సోషల్ మీడియాలో జరిగిన అవమానాల గురించి మాట్లాడుతూ వాపోతుంది

రకుల్ ప్రీత్ ఆ మధ్య ఒక ఫోటో షూట్ కోసం బ్లూ బ్రూలేట్ జీన్స్ వేసుకుంది. ఆ జీన్స్ చిన్న సైజు లో ఉండి జిప్ పెట్టుకోవడం మర్చిపోయిందంట. అంతే మీమ్స్ క్రియేటర్లకు, ట్రోల్ చేసేవాళ్లకు దొరికింది సందు. ఆ జిప్ పై ఏవేవో కథనాలు అల్లేసి సోషల్ మీడియాలో పోస్టులు చేసారు. ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి సెలెబ్రిటీలను ఇబ్బందులకు గురిచేయడం మామూలైంది అనుకోని ఊరుకుంది. మరోసారి కారులో నుండి దిగుతుండగా ప్యాంటు వేసుకోలేదని దారుణంగా ట్రోలింగ్ చేసారు. ఆ ఫోటో పై చేసిన కామెంట్లు అయితే మరీ దారుణం అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.

ఇలాంటి సంఘటనల పై రకుల్ స్పందిస్తూ.. ఒక్కోసారి సెలెబ్రిటీలు అయినా సరే కొందరి కామెంట్లకు సహనాన్ని కోల్పోతారని. నేను చేసింది కూడా అదే అంటూ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలిపింది. ఇలా దారుణంగా ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నంతకాలం మాలాంటి మహిళలకు రక్షణ లేకుండా పోతుందని వాపోయింది. ఎందుకని సెలెబ్రిటీలు చేసే కామెంట్లను మాత్రమే పట్టించుకుంటారు? ఫేక్ అకౌంట్లతో మమ్మల్ని ట్రోల్ చేసేవాళ్లను పట్టించుకోరు. నీచమైన కామెంట్లు చూసినప్పుడు ఘాటుగా జవాబివ్వడం తప్పా? అంటూ ప్రశ్నిస్తుంది. మరి అమ్మడికి ట్రోలర్స్ బాధలు ఎప్పుడు తప్పుతాయో మరి!
Tags:    

Similar News