ఆపదలో ఆదుకుంటేనే దేవుడు అంటారు. అనూహ్య విపత్తుల వేళ కార్మికుల ఉద్యోగుల కుటుంబాలు నడిరోడ్డున పడకుండా ఆదుకునేందుకు మంచి మనసుండాలి. ఇటీవల కరోనాక్రైసిస్ వేళ ప్రపంచం మొత్తం షట్ డౌన్ అయ్యింది. అయినా చాలా మంది మానవతా హృదయంతో తమ ఉద్యోగుల్ని ఆదుకునేందుకు ప్రయత్నించారు. అలాంటివాళ్లంతా దేవుళ్లతో సమానం. అందులో ఎంటర్ ప్రెన్యూర్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది.
ఈ భామ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు స్టార్ హీరోల సరసన క్రేజీ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో.. మరోవైపు తెలివైన ప్రణాళికలతో చక్క బెట్టుకుంది. ఎఫ్ 45 పేరుతో హైదరాబాద్ సహా విశాఖపట్నంలో జిమ్ లను తెరిచారు రకుల్. ఇవన్నీ ఫ్రాంఛైజీ బిజినెస్ తరహాలో ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. తదుపరి బెంగళూరు చెన్నయ్ వంటి చోట్లకు విస్తరించాలన్నది తన ప్లాన్.
కానీ ఇంతలోనే మాయదారి మహమ్మారీ వైరస్ వెంటపడి తరిమింది. కరోనా దెబ్బకు అన్ని బిజినెస్ లు కుప్పకూలాయి. ముఖ్యంగా జిమ్ములు పార్కులు కూడా మూసేశారు. దీంతో రకుల్ జిమ్ బిజినెస్ కి ఘోరమైన దెబ్బ తగిలిందట. అయితే జిమ్ లు మూసేశాం కదా అని పని వాళ్ల జీతాలు ఎగ్గొట్టేయలేదట. టైమ్ టు టైమ్ వారికి జీతాలు చెల్లించి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకున్నారట. ఆ విషయాన్ని రకుల్ స్వయంగా వెల్లడించారు.
నిజమే రకుల్ తన మానవతను చాటుకున్న గొప్ప దేవత అయ్యారు. కరోనా క్రైసిస్ చారిటీ పేరుతో మెగాస్టార్ చిరంజీవి సినీకార్మికులను ఆదుకుని దేవుడే అయ్యారు. పలువురు స్టార్లు కోట్లాది రూపాయలు సీఎం నిధికి జమ చేశారు. కానీ రకుల్ మాత్రం తన స్థాయికి తగ్గట్టు తన ఉద్యోగులకు మేలు చేశారన్నమాట. రకుల్ ఓ కీలక పాత్రలో నటించిన చెక్ రిలీజైంది. వైష్ణవ్ తేజ్ తో కలిసి క్రిష్ దర్శకత్వంలో నటించింది. ఆ మూవీ టైటిల్ ని త్వరలో ప్రకటించనున్నారు. బాలీవుడ్ లో మేడే అనే చిత్రంతో పాటు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. జాన్ అబ్రహాం సరసన ఎటాక్ లోనూ నటించగా ప్రస్తుతం ఈ మూవీ నిర్మాణానంతర పనుల్లో ఉంది.