రామ్ బోయపాటి మూవీ.. ట్విస్ట్ అదిరిపోతుందట..!

Update: 2023-01-02 09:30 GMT
అఖండ తర్వాత బోయపాటి శ్రీను క్రేజీ కాంబినేషన్ ని ఫిక్స్ చేసుకున్నారు. ఉస్తాద్ రామ్ హీరోగా భారీ సినిమా ఒకటి ప్లాన్ చేశారు. రామ్ తో బోయపాటి మూవీ చేయడం ఇదే మొదటిసారి. రామ్ ఈమధ్య కాలంలో తన కెరీర్ లో స్టార్ డైరెక్టర్ తో చేస్తున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. రామ్ బోయపాటి కలయికలో ఒక ఊర మాస్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. రామ్ ఈ సినిమా కోసం తన లుక్ మొత్తం మార్చినట్టు అర్ధమవుతుంది. పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ రామ్ ఫ్యాన్స్ ని ఎగ్జయిట్ అయ్యేలా చేస్తుంది.

సినిమాలో రామ్ పాత్ర లో చాలా ట్విస్ట్ లు ఉంటాయట. హీరో పాత్రలో చాలా వెరియేషన్స్ ఉంటాయని అంటున్నారు. ఈమధ్య పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న సినిమాల్లో కూడా కథ ఎలా ఉన్నా హీరో యాటిట్యూడ్ వేరే లెవల్ లో ఉంటుంది. ఆ హీరోయిజమే నేషనల్ లెవల్ లో ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను కూడా రామ్ పాత్రని చాలా బలంగా రాసుకున్నాడట. పాత్రలో వెరియేషన్స్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తాయని అంటున్నారు. ఈ సినిమా రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీలీల రామ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా రామ్ ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. బోయపాటి డైరెక్షన్ లో సినిమా అంటే హీరో రేంజ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. రామ్ కూడా అందుకు తగినట్టుగా వర్క్ అవుట్స్ చేస్తున్నాడట. ది వారియర్ సినిమా అంచనాలు అందుకోలేదు అందుకే ఈ సినిమా ద్వారా ఈసారి బాక్స్ఆఫీస్ దగ్గర తన సత్తా చాటాలని చూస్తున్నాడు రామ్. బోయపాటి సినిమా అంటే మాస్ ఆడియన్స్ కి పండుగే.. రామ్ లాంటి యంగ్ హీరోతో బోయపాటి చేస్తున్న ఈ ప్రయోగం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి రామ్ బోయపాటి ఇద్దరు కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా అటెంప్ట్ నేషనల్ లెవల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నారు. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టేస్తున్నారట. రామ్ డబ్బింగ్ సినిమాలకు హిందీ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తాయి.. ఆ ధైర్యంతోనే పాన్ ఇండియా రేసులో పాల్గొంటున్నాడు రామ్. ఈ కాంబో లో కరెక్ట్ సినిమా వస్తే మాత్రం రికార్డులు కొట్టే ఛాన్స్ ఉంది. మరి రామ్ బోయపాటి ఏం చేస్తారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News