సినిమా చూసేదే ఎంటర్టైన్మెంట్ కోసం. అందుకే ఎలాంటి కాన్సెప్ట్ లో అయినా కామెడీ ఉండేలా జాగ్రత్త పడ్తారు మన దర్శకులు. కొన్ని సినిమాల్లో అయితే అవసరం లేకపోయినా హాస్యాన్ని ఇరికించేస్తారు. సీన్ పండితే బానే ఉంటుంది గానీ లేకపోతే ఆ హాస్యం అపహాస్యమవుతుంది. అందుకే ధృవ విషయంలో ఎలాంటి అనవసర ప్రయోగాలు చేయలేదంటున్నాడు మెగా పవర్ స్టార్.
తమిళ్ హిట్ తనీ ఒరువన్ రీమేక్ గా వస్తోన్న రామ్ చరణ్ ధృవ సీరియస్ టోన్ లో సాగే మూవీ అని ట్రైలర్స్ చూస్తే అర్థమైపోతుంది. హీరో- విలన్ మధ్య మైండ్ గేమ్ కాన్సెప్ట్ బేస్డ్ గా నడిచే ఈ సినిమా కోసం అనవసరపు హంగామాని అస్సలు ఎంటర్టైన్ చేయలేదు. సీన్స్ అయినా.. సాంగ్సైనా సిట్యువేషనల్ గా వచ్చేవే తప్ప కమర్షియల్ టచ్ ఇద్దామని ఆలోచించి హిట్ కోసం ఫార్ములా లెక్కలేసుకోలేదనే విషయం కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. హీరో బిల్డప్స్.. అనవసరపు సాంగ్స్ జోలికి వెళ్లి ఒరిజినల్ ఫ్లేవర్ ని చెడగొట్టలేదని ధృవ యూనిట్ చెప్పింది కూడా.
మరి మాస్ ఇమేజ్ ఉన్న మీ లాంటి స్టార్ హీరో సినిమాల్లో కామెడీ లేకపోతే ఎలా? అంటే.. కామెడీ ఏమీ హిట్ ఫార్ములా కాదని సింపుల్ గా తేల్చేశాడు చెర్రీ. కామెడీ లేకుండా సింహా, మగధీర, సరైనోడు, బాహుబలి లాంటి సినిమాలు సూపర్ హిట్టయ్యాయని.. ఈ సినిమాల్లో కామెడీ ఉండదని అయినా ఆడియెన్స్ ఎమోషనల్ అరెస్ట్ అయినప్పుడు కామెడీ గురించి మాట్లాడరని ఎనాలసిస్ కూడా చేశాడు. చెర్రీ చెప్పింది కూడా పాయింటేగా. నరాలు తెగే ఉత్కంఠతో రన్నయ్యే మూవీ మధ్యలో కామెడీని తెచ్చి బలవంతంగా సినిమా నవ్వుల పాలైద్ది. అందుకే రీమేక్ లో కూడా అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లలేదని చెర్రీ క్లారిటీ ఇచ్చేశాడు.