చరణ్, అల్లు అర్జున్ జనసేన కోసం వస్తారా?

Update: 2018-12-26 10:22 GMT
ప్రస్తుత రాజకీయ పార్టీలకు భిన్నంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ఒక రాజకీయ పార్టీ స్థాపించగానే కుప్పలు తెప్పులుగా పక్క పార్టీ నుంచి నాయకులొస్తారు. కానీ జనసేనలోకి అలాంటి నాయకులకు పవన్ కళ్యాణ్ అనుమతించలేదు. రాజకీయాల్లో నీతిగా ఉన్నవారినే తీసుకుంటున్నారు. కానీ ఈ మధ్య జనసేనలో ఉన్న నాయకులు కూడా తమ పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు జనసేన బలహీనతలను వెల్లడిస్తూ నీరుగారుస్తున్నారు.

ఇటీవల తాము జనసేన నాయకులం అని చెప్పుకునే కొంత మంది నేతలు పలు యూట్యూబ్ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.  వారు వచ్చే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన తరుఫున కదిలివస్తారని.. రాంచరణ్, అల్లు అర్జున్ కూడా జనసేన తరుఫున ప్రచారం చేస్తారని చెబుతున్నారు. ఇలా మెగా ఫ్యామిలీని ఇరుకున పెట్టేలా పలు సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు జనసేన పార్టీకి నష్టం చేకూరుస్తున్నాయి. మెగా ఫ్యామిలీని ఆది నుంచి పవన్ దూరంగా ఉంచారు. అన్నయ్య నాగబాబు తాను జనసేన తరుఫున ప్రచారం చేస్తానని.. వెన్నుదన్నుగా ఉంటానని ప్రకటించినా పవన్ సున్నితంగా తిరస్కరించారు. జనసేనను కుటుంబ, వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉంచాలని.. మరో ప్రజారాజ్యం కాకూడదనే సదుద్దేశంతో పవన్ మెగా ఫ్యామిలీ సపోర్టును తీసుకోవడం లేదు. ఒంటరిగా ఎన్నికల్లో పోరాడుతున్నారు. కానీ కొందరు మెగాఫ్యామిలీ జనసేన కోసం పనిచేస్తారని చెప్పడం వల్ల పవన్ ఆశయం నీరుగారిపోతోంది.

ఒక వేళ వచ్చే ఎన్నికల్లో చరణ్, అల్లు అర్జున్ జనసేన తరుఫున ఎన్నికల ప్రచారానికి వచ్చినా అది జనసేనకు గొప్ప ఊపును తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని పవన్ వారి ప్రచారానికి ఒప్పుకుంటాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News