భారీ స్థాయిలో బోయపాటి స్టైల్లో సాంగ్

Update: 2018-12-23 12:00 GMT
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'వినయ విధేయ రామ' షూటింగ్ చివరిదశలో ఉందన్న సంగతి తెలిసిందే.  బోయపాటి ప్రస్తుతం పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.  ఈమధ్యే బాలీవుడ్ హాటీ ఈషా గుప్తా- చరణ్ ల మీద ఒక స్పెషల్ సాంగ్ ను తెరకెక్కించాడట. ఈ పాట చిత్రీకరణ పూర్తి కావడంతో ఒక్క పాట మాత్రమే మిగిలిందట.  

తాజా సమాచారం ప్రకారం చివరి పాట షూటింగ్ కూడా మొదలైందట. హైదరాబాద్ శివార్లలో ఉన్న ఖానాపూర్ లో ఒక భారీ సెట్ ఇప్పటికే నిర్మించారట.  ప్రస్తుతం ఆ సెట్లో నే చివరి పాట షూటింగ్ జరుగుతోందట.  ఈ పాట భారీ స్థాయిలో ఉండబోతోందని అంటున్నారు. ఎందుకంటే దాదాపు 800 మంది డ్యాన్సర్లు ఈ పాటలో చరణ్ తో కలిసి స్టెప్పులేస్తారట.  ఈ పాట సినిమా మొత్తం మీద హైలైట్ గా నిలుస్తుందని ఫిలిం యూనిట్ మెంబర్స్ నమ్మకంగా ఉన్నారు.

ఇదిలా ఉంటే 'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో డిసెంబర్ 27 న జరపడానికి ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.  సినిమా ట్రైలర్ ను అదేరోజు విడుదల చేస్తారట.  ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీంతో మరోసారి సూపర్ హిట్ ఆల్బమ్ అందిస్తాడనే అంచనాలున్నాయి.  ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.  డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సంక్రాంతి సీజన్లో భారీ పోటీ మధ్య ఈ సినిమా రిలీజ్ కానుంది.
Tags:    

Similar News