రామ్ చరణ్- రామారావు ఫ్యాన్స్ ఒప్పందం?

Update: 2021-12-14 04:35 GMT
రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీ రామారావుల‌ను క‌లుపుతూ రాజ‌మౌళి చేసిన అసాధార‌ణ ప్ర‌య‌త్నం RRR సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతోంది. సంక్రాంతి 2022 కానుక‌గా ఈ చిత్రం పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీగా విడుద‌ల‌వుతోంది.

ప్ర‌మోష‌న్ కి ఇంకో పాతిక రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో ప్రైమ్ ఏరియాల థియేట‌ర్ల‌న్నిటినీ బ్లాక్ చేశారు. అమెరికా స‌హా విదేశాల్లో భార‌త‌దేశంలోని ఇత‌ర ప్రాంతాల్లో మెట్రోల్లో అత్యంత భారీగా విడుద‌ల‌కు థియేట‌ర్ల‌ను సిద్ధం చేశారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇద్ద‌రు పెద్ద హీరోల‌ అభిమానుల న‌డుమ ఘ‌ర్ష‌ణ లేకుండా నివారించాలంటే అంత ఈజీ కాదు. చ‌ర‌ణ్ .. తార‌క్ ఇద్ద‌రికీ మాస్ లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. ఎవ‌రికి వారు తోపులే. రిలీజ్ ముంగిట‌ ఫ్యాన్స్ లో గ‌డ‌బిడ‌కు ఆస్కారం లేక‌పోలేదు. థియేట‌ర్ల వ‌ద్ద ఫ్లెక్సీలు క‌టౌట్లు ఏర్పాటు చేసేప్పుడు లేదా క‌లిసి సినిమా వీక్షించేప్పుడు కూడా స‌మ‌స్య‌లు రావొచ్చు.

అయితే అలాంటివేవీ లేకుండా అభిమాన సంఘాలు జాగ్ర‌త్త ప‌డుతున్నాయ‌ని తెలిసింది. మాస్ ఫ్యాన్స్ వీరంగం వేయ‌కుండా అన‌వ‌స‌రంగా ఎమోష‌న‌ల్ ఎటాక్ ల‌కు తెర తీయ‌కుండా ముందే కొత్త దారులు వెతుకుతున్నారు.

ఇటీవ‌ల‌ ట్రైలర్ రిలీజ్ కోసం ఇరువురు స్టార్ల‌ అభిమానులు తమ మధ్య థియేటర్లను విభజించుకోవడం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సినిమా రిలీజ్ కి కూడా ఇలాంటి ప్లాన్స్ జరుగుతున్నాయనే గుస‌గుస వినిపిస్తోంది. థియేటర్ల విభజనపై ఇరువురు హీరోల అభిమాన సంఘాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఒక స్టార్‌ అభిమానులు మరో స్టార్ కి కేటాయించిన థియేటర్లలోకి వెళ్లరు.

ఒక హీరో మరో హీరో థియేటర్ల వద్ద బ్యానర్లు క‌ట్టి నినాదాలు చేయడం ఉండ‌దు. ఇలాంటి క‌ఠిన‌మైన‌ నిబంధనలు రూపొందించి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. టిక్కెట్ల అమ్మకాల ప‌రంగానూ ఫ్యాన్స్ అసోసియేషన్లు బాధ్యత తీసుకుంటాయి. ఈ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే సంబంధిత అభిమానుల సంఘం అధ్యక్షులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఎన్టీఆర్ -రామ్ చరణ్ క‌లిసి న‌టించ‌డమే ఒక గొప్ప‌ వండ‌ర్. చాలా కాలం తర్వాత ఇద్దరు సూపర్ స్టార్స్‌ కలిసి సినిమా చేయడం ఇదే తొలిసారి. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రినీ త‌క్కువ చేయ‌కుండా తెరపై బ్యాలెన్స్ చేయడం ద‌ర్శ‌కునికి అంత ఈజీ కాదు. ఇది రాజమౌళి స‌వ్యంగా చేశారా లేదా? అనేదానిని బ‌ట్టి అభిమానులు ఎమోష‌న్ అవుతారు.

అభిమానులు విడుదల రోజు హంగామాను గ‌డ‌బిడ‌ల్ని త‌గ్గించేందుకు అభిమాన సంఘాల ఎత్తుగ‌డ‌లు వేయ‌డం మంచికే. RRR తెలుగు చిత్ర‌సీమ‌లో కొత్తదారులు తెర‌వ‌నుంది. ప్ర‌స్తుతం ఉన్న డ‌జ‌ను అగ్ర హీరోలు ఒక‌రితో ఒక‌రు క‌లిసి ప‌ని చేసేందుకు ఇది మార్గాన్ని సుగ‌మం చేస్తుంద‌ని అంచ‌నా.

నేటిత‌రం మ‌రిన్ని వ‌రుస మ‌ల్టీస్టార‌ర్లు చేస్తూ వెళితే ఇండ‌స్ట్రీలో స‌రికొత్త రికార్డుల్ని నెల‌కొల్ప‌డంతో పాటు తెలుగు సినిమా మార్కెట్ రేంజును అమాంతం పెంచ‌డానికి ఆస్కారం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News