మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు కొద్ది సేపటి క్రితమే హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యక్షమయ్యారు. మెగా దంపతులతో పాటు చరణ్ పెంపుడు రైమ్ కూడా వెంట ఉంది. చరణ్ ఉపాసాన ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటు వస్తోన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చరణ్ చేతుల్లో రైమ్ కనిపిస్తుంది. జంట ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో ఎక్కడికి వెళ్లారు? అన్న సందేహం మొదలైన నేపథ్యంలో విరామం కోసం ఊటి వెళ్లి తిరిగొస్తున్నట్లు నెట్టింట ప్రచారం సాగుతోంది.
షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడంతో చరణ్ ఊటికి వెళ్లినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ట్రిప్ రెండు..మూడు రోజులు పాటే సాగిందని సమాచారం. టాలీవుడ్ లో షూటింగ్ బంద్ కొనసాగినంత కాలం చరణ్ దంపతులు ఎలాంటి ట్రిప్ ప్లాన్ చేయలేదు. ఇంట్లోనే కాలక్షేపం చేసారు. స్నేహితలుతో చిలౌట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు యధా విధిగా షూటింగ్ లు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో చరణ్ ఆర్ సీ 15 షూట్ లో తిరిగి జాయిన్ అవుతారు.
ఇప్పటికే షూటింగ్ 70 శాతం పూర్తయింది. బ్యాలెన్స్ షూటింగ్ కూడా పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు శంకర్ `ఇండియాన్ -2` షూటింగ్ కూడా తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండు సినిమాల షూట్ లతో శంకర్ బిజీ అయ్యారు. ఇలా షూటింగ్ చేయడం శంకర్ కెరీర్ లోనే తొలిసారి.
అలాగే చరణ్ సినిమా షూటింగ్ ని ఇంత వేగంగా పూర్తిచేయడం కూడా ఇదే తొలి అనుభవం. సాధారణంగా శంకర్ సినిమా పూర్తవ్వడానికి సంవత్సరంనరకు పైగా సమయం పడుతుంది. కానీ ఆర్ సీ 15 కి శంకర్ అంత సమయాన్ని కేటాయించలేదు. సెట్స్ కి వెళ్లిన తర్వాత చకా చకా షూట్ చేసారు. వచ్చే ఏడాది ఆ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.