ఇప్పుడు రామ్ చరణ్ తన స్టేట్మెంట్ తో ఏకంగా సంచలనాలకు తెరలేపాడు. నిజానికి రేపు (అక్టోబర్ 15న) అమెరికాలోని న్యూ జెర్సీలో ''హ్యుమానిటీ యునైటెడ్ ఎగైనస్ట్ టెర్రర్'' అనే ఈవెంటులో.. చెర్రీ డ్యాన్సు చేస్తాడనేది న్యూస్. ఈ విషయాన్ని స్వయంగా తనే ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలియజేశాడు. అయితే ఆఖరి నిమిషంలో ఈ కాన్సర్ట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తోందని సెలవిచ్చాడు కూడా.
అవును.. తమ ఫ్యామిలీ ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉండటం వలన.. అమెరికాలో రిపబ్లిక్ హిందూ కొయాలిషన్ వారు తలపెట్టిన ఈ కాన్సర్టులో పాల్గొనడం కుదరట్లేదని చరణ్ సెలవిచ్చాడు. ఇదే కార్యక్రమంలో చరణ్ తో పాటు అఖిల్ - శ్రీయ - మనస్వి మంగాయ్ తదితరులు కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న రిపబ్లికన్ అభ్యర్ది డొనాల్డ్ ట్రంప్ కూడా వస్తాడని టాక్ ఉంది. అయితే చరణ్ రాకపోవడం ఓకె కాని.. ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జన్సీ అంటుంటే మాత్రం అభిమానులకు గుండె జారిపోయింది. ఎవరికి ఏం అయ్యుంటుందా అని వారు కలవరపడుతున్నారు.
ఇకపోతే అమెరికా ఇప్పుడు రాలేకపోతున్నందుకు.. త్వరలోనే అభిమానులను అలరించడానికి అక్కడ ఏదైనా కార్యక్రమం ప్లాన్ చేస్తాను అని సెలవిచ్చాడు రామ్ చరణ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/