మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్‌లీ దసరా కానుకగా రిలీజై అట్టర్‌ఫ్లాపైన సంగతి తెలిసిందే. పరమ రొటీన్ కంటెంట్‌తో తీసిన మూస సినిమా ఇదని తీవ్ర విమర్శలొచ్చాయి. చరణ్ ఎన్నో హోప్స్ పెట్టుకున్న ఈ సినిమా కాస్తా బాక్సాఫీస్ వద్ద ఫెయిలై తీవ్రంగా నిరాశపరిచింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని మలయాళంలోనూ రిలీజ్ చేశారు. అక్కడ కూడా సేమ్ రిపోర్ట్ వచ్చింది.
బ్రూస్‌లీ టైటిల్‌తోనే నవంబర్ 27 న దాదాపు 60 థియేటర్లలో రిలీజైంది. అయితే రిలీజ్ రెండో రోజునుంచే థియేటర్లన్నీ ఖాళీ అయిపోయాయని సమాచారం. రొటీన్ డైరెక్షన్, రొటీన్ స్టఫ్‌తో సినిమాలు తీస్తే మలయాళీలు అస్సలు క్షమించరు. పైగా బ్రూస్‌లీ తెలుగులో అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది కాబట్టి అక్కడ కూడా ఆ ప్రభావం చూపించింది. బ్రూస్‌లీ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డి.వి.వి.దానయ్య నిర్మించారు. ఆయన నుంచి తమిళ్, మలయాళం రిలీజ్ హక్కుల్ని భద్రకాళి ఫిలింస్ ఛేజిక్కించుకుంది. అయితే ఇప్పుడు మల్లూవుడ్‌లో ఫ్లాప్. తమిళ్లో ఆరంభమే రిలీజై సేమ్ రిపోర్ట్ వచ్చింది. టూ బ్యాడ్ టు బ్రూస్ లీ.