హాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కే చ‌ర‌ణ్ కండీష‌న్లు!

Update: 2023-05-23 13:00 GMT
`ఆర్ ఆర్ ఆర్` విజ‌యంతో రామ్ చ‌ర‌ణ్ రేంజ్ హాలీవుడ్ ని తాకింది. ఆస్కార్ అవార్డు గుర్తింపుతో ప్ర‌పంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యారు.  ఒక్క హిట్ తో  గ్లోబ‌ల్ స్టార్ అయ్యారు. ప్రియాంక చోప్రా త‌ర్వాత ఇండియా నుంచి గ్లోబ‌ల్ గుర్తింపు చ‌ర‌ణ్ కి మాత్ర‌మే ద‌క్కింది. తాజాగా చ‌ర‌ణ్ క‌శ్మీర్ లో జ‌రుగుతోన్న జీ-20 స‌ద‌స్స‌కు ఇండియ‌న్ స్టార్ హోదాలో హాజ‌ర‌య్యారు.  ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సులో ఎన్నో విష‌యాలు పంచుకున్నారు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

`ఇండియాలో ఎన్నో అంద‌మైన లొకేష‌న్లు ఉన్నాయి. క‌శ్మీర్ లో ఈ స‌ద‌స్సు పెట్ట‌డం ఎంతో సంతోషంగా ఉంది. కేర‌ళ‌..క‌శ్మీర్ లాంటి ఎన్నో ప్రాంతాల్లో ప్ర‌కృతి ఎంతో బాగుంటుంది. షూటింగ్ ల‌కు ఎంతో అనుకూలంగా ప్ర‌దేశాలివ‌న్ని.  నా సినిమాల ద్వారా వీటిని ప్ర‌పంచానికి చూపించాల‌నుకుంటున్నా. అందుకే నేను న‌టించే సినిమాలు ఎక్కువ‌గా ఇండియాలోనే షూటింగ్ జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నా.

ఇక‌పై కేవ‌లం లొకేష‌న్లు కోసం ఇత‌ర దేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నా. నేను హాలీవుడ్ సినిమాల్లో న‌టించినా అక్క‌డ ద‌ర్శ‌కుల‌కు ఇండియా అందాలు చూపిస్తాను. ఇక్క‌డ కూడా షూటింగ్ చేయాల‌ని కండీష‌న్ పెడ‌తాను. నార్త్..సౌత్ అని రెండు ర‌కాల సినిమాలు లేవు. ఉన్న‌ది ఒక్క‌టే సినిమా అది. భార‌తీయ సినిమా. ఇప్పుడు మ‌న సినిమా గ్లోబ‌ల్ స్థాయిలో గుర్తింపు పొందింది.

`ఆర్ ఆర్ ఆర్` సినిమాతో జ‌పాన్ ఆడియ‌న్స్ కు ఎంతో ద‌గ్గ‌ర‌య్యాం.  అక్క‌డి ప్ర‌జ‌లు ఎంతో ఆత్మీయంగా ఉంటారు.  జ‌పాన్ అంటే ఉపాస‌న‌కి ఎంతో ఇష్టం. ఇప్పుడామె ఏడు నెల‌ల గ‌ర్భిణి. ఇప్పుడు జ‌పాన్ వెళ్దామ‌న్నా! రెడీ అంటుంది. చిన్న‌ప్పుడు నాన్న గారితో  క‌లిసి సినిమా షూటింగ్ కోసం క‌శ్మీర్ వెళ్లాను.  అప్ప‌టి నుంచి ఎన్నో సార్లు ఇక్క‌డికి వ‌చ్చాను.  నాన్న గారికి ఇప్పుడు 68 ఏళ్లు.

ఇప్ప‌టికీ చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నారు.  అంత పెద్ద హీరో అయినా ఇప్ప‌టీకి ఉద‌యం 5.30 గంట‌ల‌కు నిద్ద లేస్తారు.  ఆయ‌న‌కి సినిమాల‌పై అంత‌టి నిబ‌ద్ద‌త  ఉంటుంది.  ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఆయ‌నే నాకు స్పూర్తి` అని అన్నారు.

Similar News