సహజంగా సినిమా షూటింగ్స్ అంటే.. చాలా మంది హీరోలు బాగా కట్టుదిట్టంగా వ్యవహరించేస్తూ ఉంటారు. లుక్కు దగ్గర నుంచి షూటింగ్ కి సంబంధించిన చిన్న ఫోటో కూడా బయటకు రాకుండా తెగ జాగ్రత్తలు తీసేసుకుంటూ ఉంటారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఈ రెండింటినీ భలే హ్యాండిల్ చేస్తున్నాడు.
ప్రస్తుతం గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్న చరణ్.. ఉదయం 7.30కే షూట్ మొదలుపెట్టేస్తున్నాడట. ఎండాకాలం కావడంతో.. మధ్యాహ్న సమయానికల్లా షూటింగ్ పూర్తి చేసేస్తున్నారట. ఆ తర్వాత సాయంత్రం వరకు ఫ్యాన్స్ ను కలిసేందుకే కేటాయిస్తున్నాడట చెర్రీ. మెగా పవర్ స్టార్ ను చూసేందుకు మండే ఎండలను కూడా ఖాతరు చేయకుండా వస్తున్న అభిమానులను నిరుత్సాహపరచకుండా ఎంగేజ్ చేస్తున్నాడట. అనేకమంది వస్తూవస్తూ తమతో పాటు తెచ్చిన బహుమతులను మనసారా స్వీకరిస్తూ.. మళ్లీ వారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి.. సెల్ఫీలు దిగి మరీ పంపుతున్నాడట చరణ్.
ఓ మహిళ తన అయితే తన బిడ్డకు మూత్ర పిండ వ్యాధి ఉందని మొరపెట్టుకుంటే.. వెంటనే తన అసిస్టెంట్స్ ను పిలిచి అపోలో ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సిందిగా ఆదేశించాడట. అంతే కాదు.. ఖర్చుల కోసం కొంత డబ్బు కూడా చేతిలో పెట్టి పంపాడట రామ్ చరణ్. మరో వైపు భార్యతో కలిసి సాయంత్రం నుంచి గుళ్లు గోపురాలు చక్కబెట్టేస్తుండడం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/