రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పేరు రంగస్థలం1985 అని ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. ఈ సినిమాలో చెర్రీ కొత్త లుక్ లో కనిపించనున్నాడని.. 1980ల నాటి కథతో పీరియాడిక్ మూవీ చేస్తున్నారని ఇప్పటికే తెలిసిపోయింది. సినిమాలో చరణ్ లుక్ ను దాచేందుకు కూడా యూనిట్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు.
ఏప్రిల్ నెలలో తొలి షెడ్యూల్ షూటింగ్ చేసిన సుకుమార్ అండ్ చరణ్ టీం.. ఇప్పటికే రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలుపెట్టేశారు. ఈ మూవీలో ఎక్కువ భాగం షూటింగ్ రాజమండ్రి సమీపంలో గోదావరి తీరాన జరగనుంది. మళ్లీ కొత్తగా షూటింగ్ స్టార్ట్ చేసేసిన చరణ్.. గోదావరి తీరంలో షూటింగ్ చేసేస్తున్నాడు. వర్షాలు పడుతున్నా సరే ఏ మాత్రం లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సినిమాకి సంబంధించి కొన్ని రెయిన్ ఎఫెక్ట్ షాట్స్ఉండడంతో.. వాటి కోసం ప్రస్తుతం రెయిన్ సీజన్ ను ఉపయోగించుకుంటున్నాడు దర్శకుడు సుకుమార్.
రీసెంట్ గా రామ్ చరణ్ ఇలా వర్షంలోనే లుంగీ కట్టుకుని.. మెడలో లాకెట్ తో.. కొత్త హెయిర్ స్టైల్ తో ఉన్న షూటింగ్ స్పాట్ పిక్ ఒకటి ఆన్ లైన్ లో హల్ చల్ చేసేస్తోంది. మట్టి గుట్టల్లో హవాయ్ చెప్పులు వేసుకున్న చెర్రీ లుక్ భలేగా ఉందని మెగా ఫ్యాన్స్ తెగ షేర్ చేసేసుకుంటున్నారు. ఇది ఓ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన పిక్ అని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/