చిరు, పూరీల మధ్య చెర్రీ రాయబారం?

Update: 2015-09-28 13:30 GMT
టాలీవుడ్ లో ఓపెన్ హార్టెడ్ పర్సన్ గా చరణ్ కి మంచి పేరుంది. పెద్ద చిన్నా తేడా లేకుండా కలిసిపోవడం, అందరినీ కలుపుకుపోవడంలో ముందుంటాడు. విజయం సాధిస్తే ప్రశంసిస్తాడు. ఫ్లాప్ వస్తే ఎంకరేజ్ చేస్తాడు రామ్ చరణ్. చిరు వారసుడిగా తెరపైకి వచ్చినా.. మంచి మనిషిగానూ పేరు తెచ్చుకుంటున్నాడు మెగా పవర్ స్టార్.

ఇప్పుడు ఆటో జానీ విషయంలోనూ చరణ్ ఎంటరయ్యాడు. బ్రూస్ లీ షూటింగ్ లో విపరీతమైన బిజీగా ఉన్నా సరే., పూరి ఇంటికెళ్లాడు. ఈ డైరెక్టర్ బర్త్ డే కావడంతో ఇంటికెళ్లి విషెస్ చెప్పిన చరణ్.. ఆటోజానీ విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడట. సెకండాఫ్ బాగాలేదని చిరు తనకు చెప్పలేదంటూ. మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి చెప్పాడు. దీనికి సంబంధించిన విషయాలను వివరించాడట రామ్ చరణ్. అప్పుడు అలా ఎందుకు జరిగిందో అర్ధమయ్యేట్టుగా వివరణ ఇచ్చాడట.

చరణ్ స్వయంగా ఇంటికొచ్చి మాట్లాడ్డంతో పూరీ కూడా సంతృప్తి చెందాడని తెలుస్తోంది. చిరుతో మూవీ చేసేందుకు ఇప్పటికీ నేను రెడీయే అని పూరి ఇప్పటికే చెప్పాడు. సెకండాఫ్ ని మరింత పకడ్బందీగా రెడీ చేసి రావాలని చరణ్ కోరడంతో.. పూరీ ఓకె చెప్పాడని టాక్. సో.. మళ్లీ ఇప్పుడు చిరు 151వ సినిమా గురించిన సంగతులు మొదలైపోయినట్లే. ఒకవేళ స్క్రిప్ట్ ఫైనల్ అయితే డైరెక్టర్ పూరి, ప్రొడ్యూసర్ చెర్రీ. అడ్డంకులు ఎదురైనా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేట్టుగానే కనిపిస్తోంది.
Tags:    

Similar News