టాలీవుడ్ లో అరుదైన కాంబినేషన్ సాక్షాత్కారం అయింది. మల్టీస్టారర్ మూవీకి అసలు సిసలైన అర్ధం చెప్పే మూవీపై ప్రకటన వచ్చింది. రామ్ చరణ్.. ఎన్టీఆర్ లతో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో #RRR రూపొందనుందంటూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. #RRR కథాకథనలాపై ముందు నుంచి చాలానే మాటలు వినిపించాయి.
ఎవరి అంచనాలకు తగ్గట్లుగా వారు అనేక విశ్లేషణలు కూడా చేసి పారేశారు. అయితే.. అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత వినిపిస్తున్న లేటెస్ట్ సంగతి ఏంటంటే.. ఇది ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అట. అంటే.. పునర్జన్మలు.. జానపదం సహా పలు జోనర్ లలో మూవీస్ తీసిన రాజమౌళి ఇప్పటివరకూ టచ్ చేయని జోనర్ ను ఎంచుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. సైన్స్ ఫిక్షన్ థీమ్ తోనే రామ్ చరణ్- ఎన్టీఆర్ ల పాత్రలకు లింక్ ఉంటుందట. సినిమాకు అదే అసలు సిసలైన అట్రాక్షన్ అవుతుందని కూడా అంటున్నారు.
మరోవైపు.. #RRR మూవీ అనౌన్స్ మెంట్ కు ఇచ్చిన టీజర్ లాంటి వీడియో నుంచి ఏవైనా లీక్స్ దొరుకుతాయా అని తెగ సెర్చింగ్ చేసేస్తున్నారు జనాలు. ఎంత వెతికినా రాజమౌళి.. రామ్ చరణ్.. రామారావు అన్న పేర్లు మినహాయిస్తే ఇందులో వేరే ఏ లింక్ దొరకడం లేదు. కానీ ఒక ఫోటో ద్వారా తన ఫ్యూచర్ ప్రాజెక్టుపై ముందే హింట్ ఇచ్చిన జక్కన్న.. ఈ వీడియోలోనే మూవీ కాన్సెప్ట్ పై కూడా లీక్ ఇచ్చాడని.. అది అర్ధం అయేందుకు సమయం పడుతుందని కొందరు చెబుతున్నారు.