బ్రూస్‌ లీ.. దంచేస్తున్నారు గురూ

Update: 2015-10-14 03:30 GMT
ఎప్ప‌టికెయ్య‌ది అప్ప‌టికామాట‌లాడ.. స‌జ్జ‌నుడు సుమ‌తీ! అని సుమ‌తీ శ‌త‌క‌కారుడు ఎందుకు చెప్పాడో కానీ, దీన్ని మ‌న సినిమావాళ్లు తూ.చ త‌ప్ప‌క ఆచ‌రించేస్తుంటారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఎలా ప్ర‌వ‌ర్తించాలి? ఏ సిట్యేయేష‌న్‌ ని ఎలా హ్యాండిల్ చేయాలి?  లాంటి విష‌యాల్లో రాటుదేలిపోయారంతా.

మొన్న‌టికి మొన్న దాస‌రి నారాయ‌ణ‌రావు అంత‌టివారే బ్రూస్‌ లీ సినిమా రిలీజ్‌ ని ఆపాలని కోరారు. రుద్ర‌మ‌దేవి బాగా ఆడుతోంది.. ఇలాంట‌ప్పుడు ఈ సినిమాని థియేట‌ర్ల‌లోంచి తొల‌గించొద్దు అని సెల‌విచ్చారు. అయితే అప్ప‌టికే రిలీజ్ తేదీని బ్రూస్‌ లీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఫిక్స‌యిపోయి ఉన్నారు. ప‌త్రిక‌లు, టీవీ చానెళ్ల‌లో యాడ్లు కూడా ఇచ్చేశారు. ఇలాంట‌ప్పుడు ఆప‌డం కుదిరే ప‌నా? ఓ వైపు టాలీవుడ్‌ లో కొంద‌రు నిర్మాత‌లు బ్రూస్ లీ వేగానికి ముకుతాడు వేయాల‌నుకున్నా.. అదేమంత కుద‌ర‌ని ప‌ని అయిపోయింది.

ఇక హీరో రామ్‌ చ‌ర‌ణ్ నేరుగా రంగంలోకి దిగి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చ‌క్క‌బెట్టేస్తున్నారు. ఇప్ప‌టికి ఇలా ప్ర‌వ‌ర్తిస్తేనే క‌రెక్ట్ అని ప్రాక్టిక‌ల్‌ గా చూపిస్తున్నారు. ఎన్న‌డూ లేనిది చ‌ర‌ణ్ ఇటు మీడియాని తెగ హ‌గ్ చేసేసుకుంటున్నారు. ఈరోజు 11 గంట‌ల‌కు మీడియా ఇంట‌రాక్ష‌న్ ఏర్పాటు చేసి మ‌రీ బ్రూస్‌ లీ రిలీజ్ తేదీని ప్ర‌క‌టిస్తున్నాడు. టీవీ చానెళ్ల‌కు ప్ర‌త్యేకించి ఇంట‌ర్వ్యూలు ఇస్తూ హ‌ల్‌ చ‌ల్ చేస్తున్నాడు. బాహుబ‌లి, శ్రీ‌మంతుడు ప్ర‌మోష‌న్ స్ర్టాట‌జీని అనుస‌రిస్తున్నాడు. వాటి ఫ‌లితాన్నే రిపీట్ చేయాల‌న్న కుతూహాలంతో , ఓవ‌ర్సీస్‌ ని బొమ్మాళీలా వెంటాడాల‌న్న ఉత్సాహంతో చ‌ర‌ణ్ ఈ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు.

ఇకపోతే రికార్డ్ స్థాయిలో 2000 పైగా థియేట‌ర్ల‌లో బ్రూస్‌ లీ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. మీడియాకి పిలిచి మ‌రీ ప‌బ్లిసిటీ యాడ్లు ఇచ్చి కొట్టేస్తున్నారు. ఎప్ప‌టికెయ్య‌ది... అన్న చందంగా.. దంచేస్తున్నారు గురూ!!
Tags:    

Similar News