ఈ మూడు సినిమాల భారం చరణ్‌ దే

Update: 2015-11-03 07:30 GMT
ప్రతీసారి మెగా పవర్‌ స్టార్‌ తో సినిమా చేయాలంటే.. ఆ కథను తప్పకుండా మెగాస్టార్‌ చిరంజీవికి వినిపించాల్సిందే. అలా రామ్‌ చరణ్‌ కోసం ఏ కథను చెక్కినా కూడా దానిని మెగా ఫ్యామిలీలో చాలా మందికి వినిపించాలని చాలాసార్లు మనం విన్నాం. అయితే ఇప్పుడు ఓ మూడు సినిమాలకు మాత్రం బ్రేక్‌ ఇచ్చారట. ఈసారి ఆ మూడూ చరణే స్వయంగా నిర్ణయం తీసుకోవాలట.

అలా చిరంజీవి డిసైడ్‌ చేశాక.. రామ్‌ చరణ్‌ చేసిన మొదటి సినిమా బ్రూస్‌ లీ. ఈ సినిమా కథను ఓకె చేయడం నుండి ఏ రైటర్‌ తో ఏ సీన్‌ రాయించాలి అనే విషయం వరకు.. అన్నీ స్వయంగా చరణ్‌ బాబు తీసుకున్న డెసిషన్లే. కట్‌ చేస్తే సినిమాకు ఏమైందో మనకు తెలిసిందే. ఫ్లాప్‌ టాక్‌ తో కొట్టుమిట్టాడుతూ.. కేవలం చరణ్‌ ఇమేజ్‌ వలన ఓ 40 కోట్లు వసూలు చేసింది. 30% లాస్‌ మిగిల్చింది. ఇకపోతే బ్రూస్‌ లీ తరువాత చరణ్‌ ఓకే చేసిన సినిమాలు రెండు. ఒకటి తమిళంలో వచ్చిన తని ఒరువన్‌ రీమేక్‌.. రెండోది గౌతమ్‌ మీనన్‌ చెప్పిన కథ. ఇవి కూడా మెగా ఫ్యామిలీలో ఎవ్వరూ వినలేదట. కేవలం చరణ్‌ ఒక్కడే సొంతంగా ఓకే చేసేశాడు. ఆ కథల రిజల్టు ఎలా ఉన్నా కూడా క్రెడిటంతా చరణ్‌ కే.

ఇంతకీ సడన్‌ గా ఇలా చరణ్‌ ను ఎందుకు ఏకాకిగా చేసి సినిమాలు సెలక్ట్‌ చేసుకోమంటున్నారు? అబ్బే ఏం లేదు. అలే చేయడం వలన ఏ కథ వర్కవుట్‌ అవుతుంది.. ఏది అవ్వదు అనే విషయంపై మనోడికి ఫుల్‌ క్లారిటీ వచ్చే ఛాన్సుంది. ఎన్నాళ్ళని వెనుక చిరంజీవి అండ్‌ కో కథలను ఓకే చేయడంలో హెల్ప్‌ చేస్తారు. ఆ ఇండివుడ్యుయాలిటీ తీసుకురావడానికే ఇదంతా.

Tags:    

Similar News