మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150కి.. అన్ని ఏరియాల్లోనూ సూపర్బ్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అన్ని ఏరియాల్లోనూ భారీ రేట్లకే ఈ మూవీని విక్రయించారు. ఇవన్నీ రికవర్ కావాలంటే.. ఖచ్చితంగా ఖైదీ ఇండస్ట్రీ టాప్ 2 హిట్స్ లో ఒకటిగా నిలవాల్సిందే. అయితే.. నైజాం రైట్స్ విషయంలో మాత్రం రామ్ చరణ్ మెగా ప్లాన్ వేశాడనే టాక్ ఒకటి ఇండస్ట్రీలో నడుస్తోంది.
నైజాం ఏరియాలో ఖైదీ నంబర్ 150ని రూ.16 కోట్లకు ఏషియన్ ఫిలిమ్స్ కొనుగోలు చేసిందని అన్నారు. కానీ అసలు స్టోరీ వేరేగా ఉందట. మెగాస్టార్ ల్యాండ్ మార్క్ మూవీ కొనేందుకు బడా డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు వచ్చినా.. నిర్మాత చరణ్ చెప్పిన రేట్ విని వెనక్కి తగ్గారట. అయితే.. మూవీ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న రామ్ చరణ్.. ఈ సినిమాను తనే రిలీజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడట. ఇప్పుడు నైజాంలో ఖైదీని చెర్రీనే రిలీజ్ చేస్తున్నాడని.. కానీ ఏషియన్ ఫిలిమ్స్ ద్వారా ఈ రిలీజ్ ఉంటుందనే టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఖైదీ చుట్టు నెలకొన్న బజ్.. మెగాస్టార్ రీఎంట్రీపై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ కారణంగా.. సంక్రాంతికి ఖైదీ బాక్సాఫీస్ దుమ్ముదులిపేస్తాడనే అంచనాలున్నాయి. పండుగ సీజన్ ముగిసేనాటికే మొత్తం రికవర్ చేసేయగలగాలన్నది నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్ల ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు భారీగానే జరుగుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/