విడుదలైన ఆరు నెలల తర్వాత కూడా ‘రంగస్థలం’ ఇంకా చర్చనీయాంశంగానే ఉంటోంది. థియేటర్లలో.. డిజిటల్ ఫ్లాట్ ఫాంలో ఇరగాడేసిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెర మీదా సత్తా చాటింది. దసరా కానుకగా అక్టోబరు 14న ‘రంగస్థలం’ ప్రిమియర్ షోను స్టార్ మా ఛానెల్ ప్రదర్శించింది. ఈ చిత్రానికి 19.5 టీఆర్పీ రేటింగ్స్ రావడం విశేషం. ఇదేమీ బుల్లితెర రికార్డు కాదు. దీన్ని మించిన సినిమాలు అరడజను దాకా ఉన్నాయి. ‘బాహుబలి’ సిరీస్ తో పాటు.. శ్రీమంతుడు.. మగధీర.. ఫిదా.. డీజే.. జనతా గ్యారేజ్.. ఇంతకంటే ఎక్కువ టీఆర్పీ రేటింగ్సే సాధించాయి. కాకపోతే వాటితో ‘రంగస్థలం’ను పోల్చలేం. ఎందుకంటే ఈ చిత్రం ఇప్పటికే థియేట్రికల్ రన్.. డిజిటల్ ఫ్లాట్ ఫాం ద్వారా ఇప్పటికే చాలామందికి రీచ్ అయింది.
ఈ మధ్య కాలంలో ‘రంగస్థలం’ ఆడినంత సుదీర్ఘ కాలం థియేటర్లలో మరే సినిమా ఆడలేదు. ‘బాహుబలి’ రెండు భాగాల కంటే కూడా దీనికి లాంగ్ రన్ వచ్చింది థియేటర్లలో. 50 రోజుల తర్వాత కూడా చాలా థియేటర్లలో చెప్పుకోదగ్గ షేర్ రాబడుతూ సాగిందీ చిత్రం. ఐతే ఇంత లాంగ్ రన్ ఊహించక విడుదలైన 45వ రోజుకే ‘రంగస్థలం’ను డిజిటల్ ఫ్లాట్ ఫాం అమేజాన్ లో రిలీజ్ చేయడానికి ముందే ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు. ఐదు నెలలుగా అమేజాన్ లోనూ అదరగొడుతోంది ‘రంగస్థలం’. ఇంత రీచ్ తర్వాత కూడా బుల్లితెరపై 19.5 టీఆర్పీ సాధించడం అంటే గొప్ప విషయమే. ఈ సినిమా ప్రదర్శితమైన వీకెండ్లో స్టార్ మా ఛానెల్ తెలుగులో టాప్ రేటింగ్ తో అగ్రస్థానంలో నిలవడం విశేషం. కాబట్టి బుల్లితెరమీదా ‘రంగస్థలం’ బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి.