మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బోయపాటి శీను కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం మెగా ఫాన్స్ ఎదురుచూపులు ఎంతకీ తెగడం లేదు. పోనీ టైటిల్ ఫస్ట్ లుక్ లాంటిది ఏదైనా దసరాకు వదులుతారు అనుకుంటే ఆ ఆశ నెరవేరలేదు. ఇప్పుడు దీపావళి అంటున్నారు. ఈసారి నిరాశ తప్పకపోవచ్చని టాక్. అదలా ఉంచితే గత కొద్దిరోజులుగా దీని టైటిల్ గా ప్రచారంలో ఉన్న వినయ విధేయ రామ మీద మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ ఫైనల్ గా ఇదే ఫిక్స్ కాబోతోందని సమాచారం. ఇప్పటికే పలు రకాల లోగోలు డిజైన్ చేయించి వాటిలో బెస్ట్ ఎంచుకునే పనిలో శీను చరణ్ లు ఉన్నట్టు తెలిసింది.
ఇటీవలే భీభత్సమైన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినా అరవింద సమేత వీర రాఘవ టైటిల్ ను ప్రేక్షకులు చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. ఈ నేపధ్యంలో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు ఇదే యాప్ట్ గా ఉంటుందని ఇద్దరూ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే డెబ్భై శాతం దాకా పూర్తి చేసుకున్న ఈ మూవీ బాలన్స్ ఫినిష్ చేయడం కోసం కెమెరామెన్ రిషి పంజాబ్ స్థానంలో ఆర్థర్ విల్సన్ వచ్చి చేరాడు. కాల్ షీట్స్ సమస్య అని ఇన్ సైడ్ టాక్. టైటిల్ ఫిలిం ఛాంబర్ లో డివివి దానయ్య ఇంతకు ముందే రిజిస్టర్ చేసినట్టు తెలిసింది.
మొదట్లో కాస్త సాధారణంగా అనిపించినా పోను పోను అలవాటు అవుతుందని అభిప్రాయపడినట్టు సమాచారం. చరణ్ ఈ టైటిల్ కు మొదట్లో సంశయించినా రంగస్థలం టైంలో ఇదే చర్చ వచ్చిందన్న సంగతి గుర్తు చేసుకుని ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు సమాచారం. మొత్తానికి వీర విధేయ రామా టైటిల్ కు ఫాన్స్ ప్రిపేర్ అవ్వడం బెటర్. ఇందులో రామ్ చరణ్ పేరు రామా కావడం వల్లే శీను ఇలా ఫిక్స్ చేసాడట. దీపావళికి సస్పెన్స్ మొత్తం తొలగిపోనుంది.