టాలీవుడ్ లో స్క్రిప్టు ప్రాధాన్యత పెరిగిందనడానికి ఇవిగో ఇవే ఉదాహరణలు. ఏది పడితే అది అంగీకరించేయడం అన్నది ఇప్పుడు లేనే లేదు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఆచితూచి అడుగులేస్తున్నారు. వంద శాతం స్క్రిప్టు తమను మెప్పిస్తేనే ఓకే చెబుతున్నారు. ఇంతకుముందు మహేష్ .. ఇప్పుడు చరణ్ ఇదే దారిలో వెళ్లారు.
పూరి .. సుకుమార్ .. వంశీ పైడిపల్లి లాంటి దర్శకులు కథలు వినిపిస్తే అవేవీ నచ్చలేదని తిరస్కరించారు మహేష్. అంత పెద్ద దర్శకులు ఎన్నో హిట్లు బంపర్ హిట్లు కొట్టినవాళ్లు వినిపించినా తికాణా లేదు. నిర్ధయగా తోసి పుచ్చారు. మరో స్క్రిప్టును రెడీ చేయమని చెప్పేశారు.
ఇప్పుడు రామ్ చరణ్ కూడా అదే తీరుగా వ్యవహరిస్తున్నారట. యువదర్శకుడు వెంకీ కుడుముల వినిపించిన లైన్ కి ఓకే చెప్పినా ఇప్పుడు పూర్తి స్క్రిప్టు వచ్చాక తనకు సూట్ కాదని తిరస్కరించారట. ఇది చేయలేనని వెంకీ కుడుములకు సున్నితంగా చెప్పేశారని కొన్ని లీకులు అందాయి. త్రివిక్రమ్ శిష్యుడే అయినా ఛలో- భీష్మ లాంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లతో పేరు మార్మోగినా చివరికి చరణ్ కాదన్నాడట. అన్నీ కుదిరితే చెర్రీ-వెంకీ కాంబినేషన్ మూవీ చేయాలని యువి క్రియేషన్స్ ఉవ్విళ్లూరినా కుదరలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం గాసిప్ మాత్రమే. వెంకీ కుడుములకు మరో అవకాశం ఉందా లేదా? అన్నది చూడాలి. ఇంతకుముందు మహేష్ కూడా సుకుమార్ కి నాలుగైదు అవకాశాలు ఇచ్చాకే చివరికి కాదన్నారు. ఇప్పుడు అదే తీరుగా చరణ్ మరోసారి ఫైనల్ వెర్షన్ తో రమ్మన్నారా? అన్నది వెంకీనే చెప్పాలి.