ఈ ఏడాది ఏడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా సతీమణి ఉపాసనకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చేందుకు రామ్ చరణ్ విదేశీ టూర్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు వారాల పాటు సుదీర్ఘంగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ పేరుతో తూర్పు ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ఈ జంట షికార్లు చేశారు. అక్కడ ఉపాసన క్రూరమృగాల్ని ఎంతో దగ్గరగా ఓ వాహనం నుంచి వీక్షిస్తూ చిలౌట్ చేశారు. ఈ జర్నీ ఆద్యంతం చరణ్ ఫోటోగ్రఫీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లోకి వచ్చాయి. ఇక ఇలాంటి అరుదైన అవకాశం వేరొక సెలబ్రిటీ కోడలుకి దక్కలేదంటే అతిశయోక్తి కానే కాదు.
అయితే ఈ విజిట్ ని ముగించి రామ్ చరణ్ - ఉపాసన జోడీ హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఇక రామ్ చరణ్ హైదరాబాద్ లో అడుగుపెట్టినప్పటి ఫోటోలు కొన్ని ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చరణ్ ఎంతో స్టైలిష్ లుక్ తో కనిపిస్తున్నారు. పూర్తిగా బ్లాక్ అండ్ బ్లాక్ ట్రాక్ డ్రెస్ లో చెర్రీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నారు. వైట్ టీస్ పై బ్లాక్ కోట్ ఆకట్టుకుంది. ఇక అతడు ఆర్ సీ పేరుతో క్యాప్ ని ధరించడం ఆసక్తికరం.
ఎలానూ హైదరాబాద్ లో అడుగు పెట్టారు కాబట్టి ఇక జక్కన్న - తారక్ తో కలిసి ఆర్.ఆర్.ఆర్ షెడ్యూల్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఇప్పటికే తారక్ సహా కీలక తారాగణంపై రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ సాగిస్తున్నారు. దాదాపు 6 వారాల విరామం అనంతరం సోమవారం రాత్రి నుంచి సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీ(హైదరాబాద్)లో షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. విదేశీ ఫైటర్లతో ఎన్టీఆర్‌పై పోరాట సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుంటే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.