NTRతో బంధాన్ని గుర్తు చేస్తూ చరణ్ ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్
ముందు నుంచి కూడా తెలుగు సినీ పరిశ్రమలో మెగా కుటుంబానికి, నందమూరి కుటుంబానికి మధ్య అన్ని విషయాల్లోనూ పోటీ ఉండేది. అయితే ఆసక్తికరంగా నందమూరి తారక రామారావు జూనియర్ తో కలిసి రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేయడంతో కొంతవరకు ఈ రెండు కుటుంబాల మధ్య సాన్నిహిత్య సంబంధాలు కూడా ఏర్పడ్డాయి.
అయితే వీరిద్దరి స్నేహం కూడా హాట్ టాపిక్ అవుతూ వచ్చింది. కానీ వీరిద్దరి అభిమానులు మాత్రం ఎప్పటికప్పుడు మావాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అని మావాడు తోపు అంటే మావాడు తోపు అని సోషల్ మీడియాలో తమ హీరోని ఎలివేట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీరిద్దరు మాత్రం తాము ఎంత మంచి స్నేహితులమనే విషయాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా బయటపెడుతూనే వస్తున్నారు.
తాజాగా రామ్ చరణ్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులకు సంబంధించి బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ క్యాటగిరీలో నామినేట్ అయ్యారు. ఈ క్రమంలో రామ్ చరణ్ తేజ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనకు జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్విట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ మేరకు రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులలో నామినీస్ లిస్టులో నా పేరుతో పాటు నా సోదరుడు తారక్ పేరు కూడా చూడడం చాలా ఆనందంగా ఉంది.
మా ఇద్దరి పేర్లను యాక్టింగ్ లో లెజెండ్స్ అయినా నికోలా స్కేజ్ టామ్ క్రూజ్ వంటి వారి పక్కన చూసుకోవడం భలే ఫీలింగ్ కలిగిస్తోంది అంటూ పేర్కొన్నాడు. ఒకపక్క అభిమానులేమో మావోడు గొప్ప మావోడు గొప్ప అని కామెంట్లు చేసుకుంటే ఇలా రామ్ చరణ్ మాత్రం మేము మేము బాగానే ఉంటాం... మీరు కూడా బాగుండండి అనే విధంగా ట్విట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక అవార్డుల కార్యక్రమం కోసం రామ్ చరణ్ ఇప్పటికీ అమెరికా వెళ్ళిన సంగతి తెలిసింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడున్నారు అనే విషయం మీద మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.