చరణ్‌ సెంటిమెంట్‌ తో షురూ చేస్తున్నాడు

Update: 2018-12-01 05:39 GMT
రామ్‌ చరణ్‌ - బోయపాటిల కాంబినేషన్‌ లో రూపొందుతున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఒక పాట మినహా మొత్తం పూర్తి అయిన విషయం తెల్సిందే. ఆ పాటకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే మరో వైపు చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ ను దర్శకుడు బోయపాటి చేయిస్తున్నాడు. ఇదే సమయంలో సినిమా ప్రమోషన్‌ ను షురూ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రమోషన్‌ లో భాగంగా చిత్రంలోని అన్నదమ్ముల సెంటిమెంట్‌ సాంగ్‌ ను విడుదల చేయబోతున్నాడు.

సహజంగా స్టార్‌ హీరోల సినిమాల పాటల్లో మొదట మంచి పవర్‌ ఫుల్‌, హీరో ఇంటడ్యూస్‌ అయ్యే సాంగ్‌ ను విడుదల చేస్తారు. కాని బోయపాటి మాత్రం ఈ చిత్రంలోని సెంటిమెంట్‌ సాంగ్‌ తో ప్రమోషన్‌ ను మొదలు పెట్టబోతున్నాడు. దేవిశ్రీ స్వరపర్చిన ఈ సెంటిమెంట్‌ సాంగ్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ కు తప్పకుండా కనెక్ట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు.

అన్నదమ్ముల అనుబంధంను కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో పాటు, సినిమా థీమ్‌ ను కూడా ఈ పాటలో ప్రజెంట్‌ చేస్తారని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదల సిద్దం అవుతున్న ఈ చిత్రంలోని ప్రతి పాట కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని, మ్యూజిక్‌ ఆల్బం సినిమాకు ప్లస్‌ అవుతుందనే నమ్మకంను మెగా సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News