సంక్రాంతి సమరానికి ఇంకా రెండు వారాలకు ముందుగానే వేడి ఓ రేంజ్ లో రాజుకుంటోంది. దేనికవే భారీ సినిమాలు కావడంతో ప్రేక్షకులకు రసవత్తరమైన సినిమా భోజనం ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా మీడియం లేదా బడ్జెట్ సినిమా ఉంటే మాములే అనుకోవచ్చు కానీ తలపడుతున్నవన్నీ స్టార్లవే కావడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. దిల్ రాజు ఈ సంవత్సరం తొలి బోణి ఎఫ్2తో చేయబోతున్నాడు. గత ఏడాది రాజు గారికి ఏ మాత్రం అచ్చిరాలేదు. చేసిన మూడు సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ లేదా బ్లాక్ బస్టర్ అనిపించుకోలేకపోయాయి. హలో గురు ప్రేమ కోసమే చాలా కష్టం మీద యావరేజ్ అనే ముద్ర వేయించుకుంది కానీ మిగిలిన రెండు డిజాస్టర్లే.
అందుకే కొత్త ఏడాది వెంకటేష్ వరుణ్ తేజ్ లు శుభారంభం ఇస్తారనే ఆశతో ఉన్నారు దిల్ రాజు. అయితే అవతల పోటీ ఆషామాషీగా లేకపోవడమే ఇక్కడ టెన్షన్ పెట్టే విషయం. గతంలో దిల్ రాజు వెంకటేష్ మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సంక్రాంతికి విడుదల చేసినప్పుడు అదే సమయంలో రామ్ చరణ్ నాయక్ పోటీగా వచ్చింది. రెండూ హిట్ అయినప్పటికీ నాయక్ మాస్ ప్రేక్షకుల అండతో కమర్షియల్ ఎడ్జ్ ఎక్కువ తీసుకుని తెలుగు రాష్ట్రాల వరకు వసూళ్లు ఎక్కువ రాబట్టుకుంది. ఇప్పుడు మరోసారి మల్టీ స్టారర్ తో వస్తున్న దిల్ రాజుకు నాయక్ కంటే రెట్టింపు మాస్ మసాలాలతో వస్తున్న వినయ విధేయ రామ పెద్ద సవాలే విసరనుంది.
ఎఫ్2 కామెడీ మూవీ. పెళ్లి కాక ముందు పెళ్లైయ్యాక ఇద్దరి హీరోల జీవితాలు ఎలా ఉన్నాయి అనే సింగల్ పాయింట్ మీద రాసుకున్నట్టు టాక్ ఉంది. ఫ్యామిలీస్ వరకు ఓకే కానీ మాస్ దీని వైపు ఎంతవరకు మొగ్గు చూపుతారు అనేది విశ్లేషించాల్సిన విషయం. పైగా వెంకటేష్ కు సోలోగా 40 కోట్లు తెచ్చే రేంజ్ ఇప్పుడు లేదు. వరుణ్ ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాడు. ఇదేమి టూ క్రేజీ అనిపించే కాంబో కాదు. సో అప్పుడు నాయకుడి గండం తరహాలో ఇప్పుడు రాముడి గండాన్ని దిల్ రాజు ఎదురుకోవాలి. ఇదే అనుకుంటే మరోపక్క ఎన్టీఆర్-పెట్టాలు రేస్ లో ఉన్నాయి. ఎన్ని ఉన్నా కంటెంట్ ఉన్న సినిమానే విజేతగా నిలుస్తుందన్నది నిజం. చూద్దాం