ఉపాస‌న బేబి బంప్ లుక్ ఇదిగో..స‌రోగ‌సి సందేహాలకు చెక్!

Update: 2022-12-19 15:30 GMT
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రులు కాబోతున్న విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసి ఎంత సంబ‌ర ప‌డ్డారో తెలిసిందే. చిరంజీవి లీక్ తో అభిమానుల్లో అంత‌కు మించిన ఆనందం క‌నిపించింది. చ‌ర‌ణ్ అన్న తండ్రి కాబ‌తోన్నాడంటూ..త్వ‌ర‌లోనూ జూనియర్ చ‌ర‌ణ్ వ‌చ్చేస్తున్నాడంటూ  అభిమానులు సంతోషాన్ని పంచుకున్నారు.

స‌రిగ్గా ఇలా ఆనందంలో  ఉబ్బిత‌బ్బిబోతున్న స‌మ‌యంలోనే ఉపాస‌న స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌ని కంటోంది! అంటూ ఓ  వార్త నెట్టింట వైర‌ల్  అయింది. దీంతో మెగా అభిమానుల్లో ఒక్క‌సారిగా జోష్ త‌గ్గింది. అద్దె గ‌ర్భం ద్వారా బిడ్డ ఏంటి? అంటూ అసంతృప్తికి గురైన వైనం క‌నిపించింది. అటుపై చ‌ర‌ణ్ -ఉపాస‌న స్పందించ‌డంతో ఓ క్లారిటీ వ‌చ్చింది. తాజాగా అంద‌రి అనుమానాలు..సందేహాలు ప‌టా పంచ‌ల్ చేస్తూ ఉపాస‌న ఏకంగా బేబి బంప్ లుక్ తోనే ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఫ్యామిలీ పార్టీ కోసం చెర్రి దంప‌తులు థాయ్ లాండ్ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ దిగిన ఫోటోల్ని ఉపాస‌న ఇన్ స్టా ద్వారా అభిమానుల‌కు షేర్ చేసారు. అందులో ఉపాసన ఎత్తైన పొట్ట‌తో క‌నిపించ‌డం..ఇది బేబి బంప్ లుక్ అంటూ అభిమానులు క‌న్ప‌మ్ చేసుకుంటున్నారు. దీంతో   స‌రోగ‌సి గ‌ర్భం అంటూ వ‌చ్చిన క‌థ‌నాల‌కు పుల్ స్టాప్ ప‌డింది. ఇదిగో ఇక్క‌డిలా ఉపాస‌న ఎరుపు రంగు ప్లోరల్ దుస్తుల్లో క‌నిపించ‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు.

ఎత్తుగా ఉన్న ఆమె పొట్ట‌ని  చూస్తే గ‌ర్భం దాల్చిన‌ట్లు క‌నిపిస్తున్నారు. ఆమె ప‌క్క‌నే  రామ్ చ‌ర‌ణ్ ఉన్నారు. అహ్ల‌ద‌ర‌క‌మైన  వాతావ‌ర‌ణంలో కుటుంబంతో ఇలా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. పార్టీ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఉపాస‌న ఈ ఫోటోలు లీక్ చేసి మంచి పని  చేసారు. లేదంటే మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాల‌కు ఆస్కారం ఉండేది. అన్నింటికి చెక్ పెట్టాల‌నే ఇలా ఉపాస‌న చెప్ప‌క‌నే విష‌యాన్ని చెప్పింది. ఉపాస‌న గ‌ర్బం దాల్చ‌డంతో మెగా ఇంట్లో ఇప్ప‌టికే  సంబురాలు నెల‌కొన్నాయి. ఆపాపాయి కోసం ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News