జ‌గ‌న్ ప్ర‌మాణస్వీకారోత్స‌వానికి వ‌ర్మ‌..ఈసారేం చేస్తారో?

Update: 2019-05-30 06:05 GMT
ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా.. తెలుగు సినిమా వ‌ర‌కు వ‌చ్చేస‌రికి రాంగోపాల్ వ‌ర్మ‌కు ముందు.. ఆ త‌ర్వాత అన్న విభ‌జ‌న జ‌ర‌గ‌టం ఖాయం. మూస‌గా సాగుతున్న తెలుగు సినిమాను ఉలిక్కిప‌డేలా చేసి..సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు సృష్టించిన ఆయ‌న క‌మ‌ర్షియ‌ల్ గా స‌క్సెస్ ఫుల్ సినిమాలు త‌క్కువే తీసి ఉండొచ్చు.కానీ.. త‌న ఐడియాల‌జీతో తెలుగు సినిమా మీద ఆయ‌న చూపించినంత ప్ర‌భావం మామూలు కాద‌ని చెప్పాలి.

సినిమాలే కాదు.. ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం సంచ‌ల‌నమ‌నే చెప్పాలి. ఆయ‌నేం చేసినా అదో వార్తాంశంగా మారుతుంది. అంతేకాదు.. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. సినిమా కంటితో చూసే గుణం వ‌ర్మ‌కు ఎక్కువ‌. అప్ప‌ట్లో బాంబే బాంబుపేలుళ్ల నేప‌థ్యంలో..  మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి వెంట వెళ్లిన ఆయ‌న సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. వ‌ర్మ‌ను వెంట తీసుకెళ్లిన కార‌ణంగా.. ప‌లు వివాదాల్లో చిక్కుకోవ‌టం తెలిసిందే. బాంబే బాంబు పేలుళ్ల నేప‌థ్యంలో ఆయ‌న తీసిన సినిమా స‌క్సెస్ అయ్యింది.

ఇలా తాను వెళ్లే ఏ ప్ర‌దేశాన్ని అయినా సినిమా కంటితో చూసే వ‌ర్మ‌.. తాజాగా విజ‌య‌వాడ‌కు వెళ్లిన నేప‌థ్యంలో ఆయ‌న‌కు కొత్త‌గా చోటు చేసుకున్న మార్పుల నేప‌థ్యంలో క‌మ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు పేరుతో ఒక సినిమాను అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్నారు.

ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి సంబంధించిన పాసులు త‌న‌కుఅందాయ‌ని.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డితో క‌లిసి వెళుతున్న‌ట్లు చెప్పారు. ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర్మ ఎన్ని మాట‌లు చెప్పినా.. ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా ఆయ‌న ఏ రాజ‌కీయ కార్య‌క్ర‌మానికి వెళ్లింది క‌నిపించ‌దు. అందుకు భిన్నంగా తాజాగా ఆయ‌న జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు.

మ‌రి.. జ‌గ‌న్ ప్ర‌మాణానికి వెళ్లే ఆయ‌న‌.. అక్క‌డి ప‌రిణామాల్ని సినిమా కంటితో చూడ‌టం ఖాయం. అక్క‌డ చోటు చేసుకునే ప‌రిణామాలు ఏమైనా వ‌ర్మ‌కు ఆస‌క్తిక‌రంగా భావిస్తే.. త‌ప్ప‌నిస‌రిగా ఆయ‌న ఏదో ఒక సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేయ‌టం ఖాయం. తాను అడుగు పెట్టిన ప్ర‌తిచోట త‌న వైపు అంద‌రూ చూసేలా వ్య‌వ‌హ‌రించే వ‌ర్మ‌.. తాజాగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి వెళుతున్న నేప‌థ్యంలో అక్క‌డ అంద‌రి దృష్టి యువ‌నేత మీదే ఉంటుంది. మ‌రి.. దీనిపై వ‌ర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News