పోలీస్ లను వర్మ చీట్ చేసినట్లేగా..?

Update: 2019-07-02 14:18 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఏం చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన గొప్ప సినిమాలను చేయడంతో పాటు చెత్త సినిమాలను కూడా చేసిన విషయం తెల్సిందే. ఇక వర్మ ఏకంగా పోర్న్‌ సినిమా 'గాడ్‌ సెక్స్‌ అండ్‌ ట్రూత్‌' ను కూడా వర్మ చేశాడు. కొన్నాళ్ల క్రితం వర్మ ప్రముఖ పోర్న్‌ స్టార్‌ మియా మాల్కోవాతో ఒక పోర్న్‌ సినిమాను తీయడం జరిగింది. ఆ పోర్న్‌ సినిమాను ఆన్‌ లైన్‌ ద్వారా విడుదల చేసిన వర్మకు బాగానే గిట్టుబాటు అయ్యింది. అయితే ఇండియాలో పోర్న్‌ సినిమాలపై బ్యాన్‌ ఉన్న నేపథ్యంలో దర్శకుడు వర్మను ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు.

ఇండియాలో పోర్న్‌ పై బ్యాన్‌ ఉన్న సమయంలో మీరు ఎలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ వర్మను ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో వర్మ ఈ సినిమాను అసలు ఇండియాలో తీయలేదని.. మియా మాల్కోవా యూరప్‌ లో ఉండగానే సినిమాను తీసినట్లుగా చెప్పుకొచ్చాడు. తాను స్కైప్‌ ద్వారా ఆమెకు సూచనలు చేస్తూ సినిమాను డైరెక్ట్‌ చేశాను. అంతే తప్ప ఆమె ఇండియా రావడం కాని.. నేను అక్కడకు వెళ్లడం కాని చేయలేదు అంటూ అప్పుడు పోలీసులతో చెప్పడం జరిగింది.

తాజాగా మియా మాల్కోవా పుట్టిన రోజు సందర్బంగా వర్మ చేసిన ట్వీట్‌ మరోసారి చర్చనీయాంశం అయ్యింది. గతంలో మియా మాల్కోవాను అసలు కలిసిందే లేదని చెప్పిన వర్మ ఆమెతో కలిసి ఉన్న వర్కింగ్‌ స్టిల్‌ ను రిలీజ్‌ చేయడం జరిగింది. ఆమెకు కెమెరాలో చూస్తూ సూచనలు చేస్తున్న స్టిల్‌ తో పాటు ఆమెతో వర్క్‌ ఎక్స్‌ పీరియన్స్‌ ను దర్శకుడు వర్మ షేర్‌ చేసుకున్నాడు. దాంతో వర్మ తాను గతంలో పోలీసుల వద్ద చెప్పిన విషయాలు అబద్దాలు అంటూ ఆయనే స్వయంగా ఒప్పుకున్నట్లయ్యింది.

పోలీసులను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్స్‌ ఈ విషయాన్ని షేర్‌ చేస్తూ ఉన్నారు. వర్మ గతంలో మియా మాల్కోవాను కలవలేదంటూ పోలీసులకు చెప్పాడు.. మరి ఈ ఫొటో ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ముంబయి పోలీసులు ఇది చూసి ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఫొటోను ఫొటో షాప్‌ మ్యాజిక్‌ అని వర్మ అంటాడేమో చూడాలి.
Tags:    

Similar News