చైనాలో పుట్టి ప్రపంచాన్ని ఒణికిస్తోంది కరోనా వైరస్. దేశ పౌరులను కాపాడుకునేందుకు అక్కడి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. బాధితులకు సేవలందించే క్రమంలో డాక్టర్లు సైతం మృత్యువాత పడాల్సిన పరిస్థితి. అయినా కరోనాని జయించి తీరుతామని సేవలందించడంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా పోరాటం సాగిస్తున్నారు. కరోనాకు టీకా కనిపెట్టాలంటే మరో 18 నెలలు ఆగాల్సిందేనేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చేతులేత్తేసింది. అప్పటివరకూ మృత్యు ఘోష తప్పదని అర్థమవుతోంది.
ప్రస్తుతం చైనా నిర్భందనంలో ఉంది. ఇతర దేశాల నుంచి రాకపోకలు తాత్కలికంగా నిలిచిపోయాయి. ఆ ప్రభావం టాలీవుడ్ సినిమాలపైనా పడింది. ఇప్పటికే నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ ని చైనాలో చిత్రీకరించాల్సి ఉంది. చైనా- థాయ్ లాండ్ లో నెల రోజులు షూటింగ్ ప్లాన్ చేస్తుకున్నారు. కానీ కరోనా భయంతో యూనిట్ వెనకడుగు వేసింది. తాజాగా రాంగోపాల్ వర్మ కరోనాకు భయపడి వెనకడుగేశారు. ఆయన దర్శకత్వంలో ఇండో-చైనా బ్యాక్ డ్రాప్ లో `ఎంటర్ ది డ్రాగన్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇండో-చైనా తొలి మార్షల్ ఆర్స్ట్ చిత్రంగా వర్మ దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇండియా సహా చైనాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది.
దీనిలో భాగంగా ఇప్పటికే చైనాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంకా బ్యాలెన్స్ ఎపిసోడ్స్ పూర్తిచేయాల్సి ఉంది. సరిగ్గా యూనిట్ చైనా ప్లైట్ ఎక్కడానికి రెడీ అవుతున్న సమయంలో కరోనా ఎటాక్ చేయడంతో ఆ షెడ్యూల్ ని దాదాపు మూడు నెలలు పాటు వాయిదా వేసారు. మొత్తానికి కరోనా టాలీవుడ్ లో కూడా కల్లోలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆర్జీవీ లాంటి మొండి ఘటాన్నే భయపెట్టింది మరి!!