మండిన వాళ్లే బాగా ఎంజాయ్ చేశారు

Update: 2017-03-11 03:38 GMT
మంట పెట్టి.. ఆరడానికి నీళ్లు పోసి.. మళ్లీ ఆరకుండా ఉండేందుకు పెట్రోల్ పోయడం అంటే ఇలాగే ఉంటుంది. అచ్చు రాంగోపాల్ వర్మ స్టైల్ లోనే ఉంటుంది. ఉమెన్స్ డే రోజున 'మహిళలంతా సన్నీలియోన్ లా ఆనందం పంచాలని కోరుకుంటున్నా' అని కామెంట్ పెట్టి జనాలతో తిట్లు చీవాట్లు తిన్న వర్మ.. ఆ తర్వాత కండిషనల్ గా సారీ చెప్పిన సంగతి తెలిసిందే.

'నిజంగా బాధ పడుతున్న వాళ్లకే నా క్షమాపణ' అని చెప్పిన వర్మ.. ఇప్పుడు తన సర్కార్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. వీటిలో కూడా వర్మకు ఉమెన్స్ కామెంట్స్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి. 'నాపై విపరీతంగా కోపం తెచ్చేసుకుని తెగ బాధ పడిపోయిన వాళ్లే.. ఆ కామెంట్స్ కి ఎక్కువగా ఎంజాయ్ చేసినట్లున్నారు. ఓసారి నాకు బెదిరింపులు కూడా వచ్చాయి. ఓ పోలీస్ నాకు ఫోన్ చేసినపుడు.. నన్ను అరెస్ట్ చేస్తారు అనుకున్నా. తాను నవ్వుతూనే కుర్చీలోంచి పడిపోయానని చెప్పారాయన' అన్నాడు వర్మ.

కాంట్రవర్శియల్ కామెంట్స్ మాత్రమే కాకుండా.. ఈయన సినిమాలు కూడా ఈ బాపతే ఉంటాయి. తాజాగా తెరకెక్కుతున్న సర్కార్3 చిత్రం.. బాల్ థాకరే జీవితం అనే టాక్ ఉంది. ఇది బాల్ థాకరే జీవిత చరిత్ర కాదన్న వర్మ.. ఆయన్నుంచి తీసుకున్న ఇన్ స్పిరేషన్ మాత్రమే అని చెప్పడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News