పవన్‌ కు ఫ్యాన్స్‌ లేరా? ఎందుకిలా?

Update: 2015-09-30 04:16 GMT
ఏదో ఒక విషయంలో తన నోటి దూల చూపించకపోతే దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మకు అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు. మనోడు ఎప్పుడూ ఎవరో ఒకరిని కెలుకుతూనే ఉంటాడు. దట్‌ టూ.. కాంట్రోవర్శీ కావాలి కాబట్టి ఏకంగా పెద్ద తలకాయల విషయంలోనే రచ్చ చేస్తుంటాడు. అదిగో ఇప్పుడు మరోసారి పవన్‌ కళ్యాణ్ పై పడ్డాడు.

''పవన్‌ కళ్యాన్‌ అటు పాలిటిక్స్‌ లోనూ ఇటు సినిమాల్లోనూ ఉన్నాడు.. కాని ఆయనకు మహేష్‌ బాబు కంటే ట్విట్టర్‌ లో ఫాలోవర్లు తక్కువగా ఉన్నారు. ఏకంగా రాష్ట్రంనే మార్చేద్దాం అనుకుంటున్న పవన్‌.. ముందుగా తన అభిమానులకు టెక్నాలజీపై అవగాహన కలిగించి.. తన ట్విట్టర్‌ లో ఫాలోవర్లను పెంచుకోవాలి'' అంటూ సలహా ఇచ్చాడు రాము. నిజానికి ట్విట్టర్‌ లో ఫాలోవర్ల సంఖ్యను చూసుకుంటూ పవన్‌ కళ్యాణ్‌ కు 6 లక్షల ఫాలోవర్లు ఉండగా.. మహేష్‌ బాబుకు 15 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయినా ఈ ఫాలోవర్లు కొలమానం ఏంటండీ?

అలాగైతే రామ్‌ గోపాల్‌ వర్మకు కూడా 14 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే ఆయన సినిమాలు కూడా మహేష్‌ బాబు సినిమాల రేంజులో ఆడేయాలి మరి. ఈ ట్విట్టర్‌ ఫాలోవర్స్‌ అనేది.. ఎకౌంట్‌ ను క్రియేట్‌ చేసి ఎన్ని రోజులైంది.. మనం ఎంత యాక్టివ్‌ గా ట్వీట్లు వేస్తున్నాం అనే అంశాలపై ఆధారపడుంటుంది. అలాగని ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంత గొప్పన్నట్లు కాదు. పవన్‌.. మహేష్‌.. ఎవరి రేంజ్‌ వారిదే.. ఈ వర్మకు ఎందుకో దూల...
Tags:    

Similar News