లక్ష్మీ పార్వతి పై ఆర్జీవీ పంచ్.. తర్వాత కవరింగ్!

Update: 2018-10-20 07:18 GMT
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ మాటల పుట్ట... లోకల్ పాలిటిక్స్ నుండి నీషే ఫిలాసఫీ వరకూ.. రాఘవేంద్రరావు నుండి అకిరా కురసోవా వరకూ ఏ టాపిక్ అయినా అనర్గళంగా మాట్లాడడమే కాదు.. ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ చెప్పగల మేథావి.  శ్రీరెడ్డి ఎపిసోడ్..  'ఆఫీసర్' స్ట్రోక్ దెబ్బకు కాస్త లో ప్రొఫైల్ లోకి వెళ్ళినట్టు అందరికీ అనిపించింది. పువ్వు -పరిమళం ఎలా ఒకటిగా ఉంటాయో.. వర్మ-వివాదాలు కూడా ఒకటిగానే ఉంటాయి.  తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' తో సంచలనం సృష్టిస్తున్నాడు.

'లక్ష్మీస్ ఎన్టీఆర్'  పోస్టర్ అవిష్కరించిన సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ లో మాట్లాడాడు.  జర్నలిస్టుల ప్రశ్నలకు తన టిపికల్ లాజిక్కులతో జవాబులిచ్చాడు.  ఇక లక్ష్మీ పార్వతి పై కూడా ఒక పంచ్ డైలాగ్ వేయడం విశేషం. "సినిమాల్లో శ్రీదేవి - జయసుధ - జయప్రద వంటి అందగత్తెలతో నటించిన ఎన్టీఆర్... వాళ్లని పక్కనబెట్టి నిన్నెలా పెళ్లి చేసుకున్నాడు? ఆ ముగ్గురు అందగత్తెల్ని పక్కకు నెట్టి మీ పర్సనాలిటీతో ఆయన్ను ఆకట్టుకున్నందుకు నేను చింతిస్తున్నాను" అన్నాడు.  ఆ ముగ్గురు బ్యూటీలకు తాను వీరాభిమానినని అన్నాడు.  కాకపోతే లక్ష్మీ పార్వతి వల్లే ఈరోజు ఈ సినిమా తీసే అవకాశం వచ్చిందని కవరింగ్ ఇచ్చాడు.

ఇక ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఒక మనిషిగా ఆయనకున్న వ్యక్తిత్వం.. కాన్ఫిడెన్సు.. నమ్మినదాన్ని ఏమాత్రం జంకకుండా అందరి ముందుకు నిజాయితీగా చెప్పడం తనకు నచ్చిన అంశాలని అన్నాడు. ఇక ఎన్టీఆర్ కాలం నుండి ఇప్పటి వరకూ రాజకీయనాయకులు ఒంగి దండాలు పెట్టి ఓట్లు అడుగుతారు.. కానీ ఎన్టీఆర్ ఒక్కరే రేయ్ అంటూ ఓట్లడిగారు. అయన మనసులోని నిజాయితీ అది.. ఓట్ల కోసం అడుక్కోవాల్సిన అవసరం లేదని అయనకు తెలుసని అన్నాడు.

"ఎన్టీఆర్ గారు లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు.. ఆ తర్వాత ఆవిడపై కొన్ని నెగెటివ్ వార్తలు చదవడం.. వేరే వేరే అభిప్రాయలు ఇతరుల ద్వారా వినడం జరిగింది. అప్పుడు అవి నిజమా కాదా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు.  కానీ లక్ష్మీ పార్వతి కోణంలో సినిమా తీయాలని అనుకున్నప్పుడు సీరియస్ గా రీసెర్చ్ చేశాను. అప్పుడు ఎన్టీఆర్ గారి వీడియో ఒకటి యూట్యూబ్ లో చూడడం జరిగింది. అయన ఆయన చనిపోయే కొన్ని రోజుల ముందు లక్ష్మి పార్వతి గారి గురించి ఎనలేని గౌరవంతో మాట్లాడటం  చూశాను. అది చూసిన తర్వాత ఆయన వీడియో కన్నా పెద్ద సాక్ష్యం అవసరం లేదనిపించింది."

"ఒక వైపు ఎన్టీఆర్ మహానుభావుడు అంటూ అయన చేసిన గొప్ప పనుల గురించి ప్రచారం చేస్తూ అయన ఫోటోలు పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు.  కానీ వాళ్ళే ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి గారి ప్రలోభానికి గురయ్యారని ప్రచారం చేస్తున్నారు.  దానర్థం ఎన్టీఆర్ గారికి మైండ్ లేదని చెబుతున్నారా? ఎన్టీఆర్ గారికి ఉన్నమైండ్ వీళ్ళకు ఉందనా?  నా సినిమా నిజాలు నిరూపించబోయే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉంటుంది. ఇదొక హిస్టారికల్ మూవీ.  ఏం జరిగిందో అందరికీ తెలుసు. నేను వాటి వెనకున్న నిజాలను నేను చెబుతాను."

"నిర్మాత రాకేశ్ రెడ్డి గారు వైసిపీ లీడర్ కావడంతో ఈ సినిమా వెనక ఆ పార్టీ ఉందని కొందరు అంటున్నారు. నిర్మాతలు ఆ పార్టీ కి చెందినవారే కానీ వైసిపీకి ఈ సినిమాకు సంబంధం లేదు.  ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ప్రలోభానికి గురయ్యారనేది ఎంత తప్పో... వైసీపీ నన్ను వాడుకుని రాజకీయ లబ్ది కోసం ఈ సినిమా చేయిస్తుంది అనేది అంతే తప్పు."

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View

Tags:    

Similar News