దేవకట్టాకు షాక్ ఇచ్చిన ఆర్జీవీ

Update: 2017-07-10 07:37 GMT
యన్టీఆర్ బయోపిక్ తీస్తా అని సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమా రోజుకో మలుపు తిరుగుతోంది. బాలకృష్ణ యన్టీఆర్ గా నటిస్తున్నాడని, మోక్షజ్ఞ ఈ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడనే టాక్స్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిన్నటికంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల మధ్య వినిపిస్తోంది.

ఆర్జీవీ ఎనౌన్స్ మెంట్ కంటే ముందరే బాలకృష్ణ సన్నిహితులు కొందరు యన్టీఆర్ బయోపిక్ పై ఫైల్లు కదిపారు. బాలయ్య సపోర్ట్ తోనే యన్టీఆర్ బయోపిక్ పై స్టోరీ డిస్కషన్లు జరిగాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సిట్టింగ్స్ మొత్తం దర్శకుడు దేవకట్టా హ్యాండిల్ చేసినట్లు తెలిసింది. దాదాపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం దేవకట్టా రెడీ చేశాడని, బాలకృష్ణ కూడా ఆ స్క్రీప్ట్ ఆమోద ముద్ర వేసినట్లు టాక్. అయితే ఇంతలో ఆర్జీవీ నుంచి యన్టీఆర్ బయోపిక్ పై ఎనౌన్స్ మెంట్ రావడంతో, దేవకట్టాను కేవలం స్క్రీప్ట్ వర్క్ కోసమే వాడకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే ఆర్జీవీ ఇచ్చిన స్టేట్ మెంట్ పై ఇంతవరకు బాలయ్య నుంచి స్పందన రాకపోవడం పలు ఆలోచనలకు దారి తీస్తోంది. అసలు దేవకట్టా డైరెక్షన్ లోనే యన్టీఆర్ బయోపిక్ ఉంటుందని, అందులోనే బాలయ్య నటిస్తాడని, ఆర్జీవీ తీసే బయోపిక్ వేరనేవారు లేకపోలేదు. మరి ఈ కన్ఫ్యూజన్ కు ఓ క్లారిటీ రావాలంటే స్వయంగా బాలయ్యే రంగంలోకి దిగాలి.
Tags:    

Similar News