మన రామ్ గోపాల్ వర్మకు.. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు శతృత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫ్యామిలీ ఎమోషన్లు ప్రధానంగా సాగే కరణ్ జోహార్ సినిమాలు చాలా బోరింగ్ అంటూ అప్పట్లో వర్మ ఇచ్చిన స్టేట్ మెంట్ బాలీవుడ్ లో పెద్ద సంచలనమైంది. ఇంకా చాలాసార్లు తన స్టేట్ మెంట్లతో కరణ్ ను ఉడికించాడు వర్మ. ఇద్దరి మధ్య చాలాసార్లు మాటల యుద్ధం సాగింది. ఐతే వర్మ ఫామ్ లో ఉన్నపుడు ఏం మాట్లాడినా చెల్లిపోయింది కానీ.. వరుస ఫెయిల్యూర్లతో డిమాండ్ తగ్గిపోయాక అక్కడి మీడియా వర్మ మాటలకు విలువ ఇవ్వడం మానేసింది. ఇక ముంబయి వదిలేసి హైదరాబాద్ కు మకాం మార్చేశాక వర్మను పట్టించుకునే నాథుడే లేకపోయాడు.
ఐతే వర్మ ఈ మధ్యే మళ్లీ ముంబయికి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ‘కంపెనీ’ పేరుతో కొత్త ఆఫీస్ తెరిచి ముంబయి మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు వర్మ. ఈ సందర్భంగా ఓ విలేకరి కరణ్ ప్రస్తావన తెస్తే.. ‘‘ఐ లవ్ కరణ్ జోహార్’’ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి షాకిచ్చాడు వర్మ. ‘‘నేను ముంబయికి తిరిగొచ్చాకే తెలిసింది.. బాలీవుడ్ మీద - కరణ్ జోహార్ మీద నాకు చాలా ప్రేమ ఉందని. కానీ బాలీవుడ్ కు.. కరణ్ జోహార్ కే నా మీద పెద్దగా ప్రేమ లేదు సరే నన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకున్నా పర్వాలేదు. నేను మాత్రం కరణ్ జోహార్ ను చాలా ఇష్టపడతాను’’ అంటూ తనదైన శైలిలో కామెంట్ చేశాడు వర్మ. ఐతే రాము ఏదో సెటైరిగ్గానే ఈ మాటలు అని ఉంటాడని మీడియా వాళ్లకు కూడా బాగా తెలుసు. మరి కరణ్ ఈ మాటల్ని ఎలా అర్థం చేసుకుంటాడో చూడాలి.